నాని దర్శకుడితో విజయ్ దేవరకొండ సినిమా.. ప్లాన్ చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు..

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్..

  • Rajeev Rayala
  • Publish Date - 10:26 pm, Mon, 28 December 20
నాని దర్శకుడితో విజయ్ దేవరకొండ సినిమా..  ప్లాన్ చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు..

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా కరోనా అడ్డుపడింది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఈ సినిమాతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ కి అనన్య పాండే టాలీవుడ్ ఇండస్ట్రీలకు ఒకేసారి పరిచయం కాబోతున్నారు. అయితే ప్రస్తుతం షూటింగ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా ఏప్రిల్ నెల వరకు పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఈ సినిమా తర్వాత విజయ్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడని ఆమధ్య వార్తలు వచ్చాయి.  అయితే తాజాగా విజయ్ మరో దర్శకుడితో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. ‘నిన్ను కోరి’, ‘మజిలీ ‘ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శివ నిర్వాణ తో విజయ్ సినిమా ఉండనుందని తెలుస్తుంది. ప్రస్తుతం తన మూడో సినిమా ‘టక్ జగదీష్’ను నేచురల్ స్టార్ నానితో చేస్తున్నాడు శివ. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని చూస్తున్నాడట. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో ప్రారంభించాలని చూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.