AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2020 Round Up : కరోనా సమయంలోనూ సత్తా చాటి..ప్రేక్షుకుల మనసులు గెలిచిన కొత్త దర్శకులు వీరే

ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీపై కరోనా చూపించిన ప్రభావం అంతా, ఇంతా కాదు. చాలా సినిమాలు కరోనా కారణంగా ఆగిపోయాయి. వేల సంఖ్యలు జూనియర్ ఆర్టిస్టులు..చిన్న, చిన్న టెక్నిషియనల్లు పనులు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

2020 Round Up : కరోనా సమయంలోనూ సత్తా చాటి..ప్రేక్షుకుల మనసులు గెలిచిన కొత్త దర్శకులు వీరే
Ram Naramaneni
|

Updated on: Dec 29, 2020 | 3:06 PM

Share

ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీపై కరోనా చూపించిన ప్రభావం అంతా, ఇంతా కాదు. చాలా సినిమాలు కరోనా కారణంగా ఆగిపోయాయి. వేల సంఖ్యలు జూనియర్ ఆర్టిస్టులు..చిన్న, చిన్న టెక్నిషియనల్లు పనులు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రిలీజ్ అయిన కొద్ది సినిమాల్లోనే కొత్త దర్శకులు సత్తా చాటారు. తమ మార్క్‌ మేకింగ్‌లో ఇండస్ట్రీపై ముద్ర వేశారు. తాము కూడా రేసులోకి వచ్చామంటూ సంకేతాలు పంపారు.  కొంతమంది వెండితెరపైనే తమ మార్క్ చూపగా..మరికొందరు ఓటీటీల ద్వారా అదరగొట్టారు. 2020 లో ఎంట్రీ ఇచ్చి..ప్రేక్షకులను అలరించిన దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

హిట్ దర్శకుడు శైలేష్‌ కొలను :

హీరోగా మంచి సినిమాలు చేస్తూనే మరోవైపు సినిమాలు నిర్మిస్తూ తన అభిరుచిని చాటుకుంటున్నారు నేచురల్ స్టార్ నాని. గతంలో ఈయన అ తో ప్రశాంత్ వర్మ అనే దర్శకుడిని వెండితెరకు పరిచయం చేశారు. ఈ ఏడాది ‘హిట్‌’ చిత్రంతో శైలేష్‌ కొలనును కూడా కెప్టెన్‌గా ప్రమోట్ చేశాడు. ఈ మూవీ మంచి అప్లాజ్ దక్కించుకుంది. ఓ విభిన్నమైన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ స్టోరీతో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది.

పలాస దర్శకుడు కరుణ కుమార్ :

‘పలాస’ చిత్రంతో కరుణ కుమార్‌ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌లో ఊహించని విధంగా సందడి చేశారు. 1978లో మనుషుల మధ్య అంతరాల్ని ఎత్తి చూపుతూ.. ఇతివృత్తంగా కళను ఎన్నుకున్న ఆయన మంచి సినిమాను ప్రేక్షకులకు అందించారు. ఈ మూవీకి సాధారాణ ప్రేక్షకులతో పాటు విమర్శకులతో ప్రశంసలు సైతం దక్కాయి.  ముఖ్యంగా ఈ చిత్రంతో శ్రీకాకుళం పల్లె జీవితాల్ని, వాళ్ల జీవభాషని తెరపై చాలా ఎమోషనల్‌గా చూపించారు కరుణ కుమార్.

ఓ పిట్ట కథ దర్శకుడు చెందు ముద్దు :

ఓ పిట్ట కథ అనే సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చాడు దర్శకుడు చెందు ముద్దు. ఇందులో బ్రహ్మజీ కొడుకు సంజయ్ కుమార్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా కథకు మంచి మార్కులు పడ్డాయి. వెండితెరపై అంతగా ఆకట్టుకోలేకపోయినా..ఓటీటీ వేదికగా మాత్రం ఈ మూవీ జోరు చూపించింది.

భానుమతి రామకృష్ణ దర్శకుడు శ్రీకాంత్‌ నాగోతి :

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో థియేటర్లు మూతపడ్డాయి. ఈ క్రమంలో చాలా చిత్రాలు ఓటీటీల్లో నేరుగా విడుదలయ్యాయి. వీటిలో ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన చిత్రం భానుమతి రామకృష్ణ. నవీన్‌ చంద్ర కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంతో దర్శకుడిగా ప్రేక్షకుల మనసులు గెలిచారు శ్రీకాంత్‌ నాగోతి. కాస్త వయసు ఎక్కువ ఇద్దరు వ్యక్తుల ప్రేమ, భావోద్వేగాలు కలయికతో.. ఓ కొత్త కాన్సెప్ట్‌ను ప్రేక్షకులకు రుచి చూపించారు. ఈ సినిమాకు అదిరిపోయే రివ్యూలు వచ్చాయి.

కలర్‌ఫొటో దర్శకుడు సందీప్‌రాజ్ :

ప్రేమకు మన కులం, మతం, డబ్బు, ప్రాంతాలు అడ్డు ఉంటాయని ఇప్పటివరకు చాలా సినిమాల్లో చూశాం. కానీ రంగు కూడా అడ్గుగా ఉంటుందని కలర్‌ఫొటోతో చూపించి అదరగొట్టాడు దర్శకుడు సందీప్‌రాజ్‌. ఈ చిత్రంతో సుహాస్‌, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా నటించారు. సునీల్ విలన్‌గా కనిపించారు. ఈ సినిమాకు ఇండస్ట్రీ వర్గాల నుంచి మంచి మద్దతు లభించింది. జగపతిబాబు, అల్లు అర్జున్ లాంటి టాప్ స్టార్ సినిమా నటీనటులను, సాంకేతిక బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

జోహార్‌ దర్శకుడు తేజ మార్ని :

రాజకీయ నాయకులు విగ్రహాల పేరుతో చేసే రాజకీయాల వల్ల.. ప్రజల జీవితాలు ఎలా ఛిన్నాభిన్నం అవుతాయో జోహార్‌తో చూపించారు దర్శకుడు తేజ మార్ని. ఆయన చేసిన ఈ తొలి ప్రయత్నానికి మంచి మార్కులే పడ్డాయి. చాలామంది దర్శకుడి డేరింగ్ ప్రయత్నాన్ని అభినందించారు.

మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్ దర్శకుడు వినోద్‌ అనంతోజ్ :

మధ్యతరగతి కథలు ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.  చిన్న, చిన్న భావోద్వేగాలు..వారి ఆశలు..ప్రేమలు ఎలా ఉంటాయో మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్ సినిమాలో చూపించారు అదరగొట్టాడు‌ వినోద్‌ అనంతోజ్‌. సరికొత్త పంథాలో ఈ చిత్రాన్ని తెరకెక్కించి..తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందాడు.

Also Read :

House sites distribution : ఇళ్ల పట్టాలు చేతికందిన ఆనందం.. లబ్దిదారులు సీఎంపై ఇలా చూపించారు అభిమానం

Madduvalasa Fishes : మడ్డువలస చేపలు..క్యూ కడుతున్న జనాలు..ఒక్కసారి టేస్ట్ చేస్తే వదలరు !

Tirumala News : కలశం గుర్తును శిలువగా తప్పుడు ప్రచారం..టీటీడీ సీరియస్..పోలీసులకు ఫిర్యాదు..