Congress Leader: నాకు ప్రాణహానీ ఉంది.. డీజీపీ మహేందర్ రెడ్డికి లేఖ రాసిన కాంగ్రెస్ సీనియర్ నేత..
కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంత రావు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డికి లేఖ రాశారు. తన ప్రాణహానీ ఉందని ఆ లేఖలో..
Congress Leader: కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంత రావు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డికి లేఖ రాశారు. తన ప్రాణహానీ ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. తనకు శనివారం నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, చంపేస్తానంటూ గుర్తు తెలియని వ్యక్తులు తనను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని వీహెచ్ తాను రాసిన లేఖలో డీజీపీకి ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి అనుచరులుగా చెప్పుకుంటున్న కొంత మంది నుంచి తనకు ఈ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అన్నారు. తనకు ప్రాణహానీ ఉన్నందున సెక్యూరిటీని పెంచాలని డీజీపీని వీహెచ్ కోరారు.
కాగా, పీసీసీ చీఫ్ పదవిని రేవంత్ రెడ్డికి ఇస్తే ఊరుకునేది లేదని వీహెచ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు తాము రేవంత్ రెడ్డి అభిమానులం అని చెప్పుకుంటూ వీహెచ్‌కు ఫోన్ చేసి బెదిరించారు. నోటికొచ్చినట్లుగా తిట్టారు. చంపేస్తామంటూ బెదిరించారు కూడా. దుండగుల ఫోన్ కాల్‌పై వీహెచ్ స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దానిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
Oxford vaccine: ఆక్స్‌ఫర్డ్ టీకా.. 5 కోట్ల డోసులు సిద్ధంగా ఉంచాము: సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈవో