ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాను స‌స్య‌శ్యామ‌లంగా చేస్తాం : మ‌ంత్రి శ్రీ‌నివాస్ గౌడ్‌

ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాను స‌స్య‌శ్యామ‌లం చేస్తామ‌ని మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ అన్నారు. సోమ‌వారం ఆయ‌న నారాయ‌ణ‌పేట మార్కెట్‌క‌మిటీ పాల‌క వ‌ర్గ ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డితో...

ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాను స‌స్య‌శ్యామ‌లంగా చేస్తాం : మ‌ంత్రి శ్రీ‌నివాస్ గౌడ్‌
Follow us
Subhash Goud

|

Updated on: Dec 28, 2020 | 10:15 PM

ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాను స‌స్య‌శ్యామ‌లం చేస్తామ‌ని మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ అన్నారు. సోమ‌వారం ఆయ‌న నారాయ‌ణ‌పేట మార్కెట్‌ క‌మిటీ పాల‌క వ‌ర్గ ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డితో క‌లిసి ఆయ‌న హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా చైర్మ‌న్ భాస్క‌ర కుమారి వెంక‌ట్ రెడ్డితో పాటు స‌భ్యుల‌తో ప్ర‌మాణ స్వీకారం చేయించి మాట్లాడారు. పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి అన్ని చెరువుల‌ను నింపుతామ‌ని అన్నారు.

పాల‌మూరు జిల్లా అంటే ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఎంతో ప్రేమ అని, సాగునీరు రావ‌డంతో భూముల ధ‌ర‌లు భారీగా పెరిగాయ‌న్నారు. సాగుకు ఉచిత విద్యుత్‌, రైతు బంధు, రైతు బీమా త‌దిత‌ర సంక్షేమ ప‌థ‌కాల‌తో రైతుల జీవితాల్లో ముఖ్య‌మంత్రి వెలుగులు నింపార‌న్నారు. రాష్ట్రంలో అన్ని సాగు ప్రాజెక్టులు పూర్త‌యితే తెలంగాణ కోటి ఎక‌రాల‌కు మగాణిగా మారుతుంద‌ని శ్రీ‌నివాస్ గౌడ్ అన్నారు. కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాలు రైతుల‌కు న‌ష్టం చేకూర్చేలా ఉన్నాయ‌ని, ఈ చ‌ట్టాల‌తో ఏ ప్ర‌యోజ‌నం చేకూరుతుందో మూడు నెల‌ల్లో పంట‌లు వ‌చ్చిన‌ప్పుడు తెలుస్తుంద‌న్నారు.