AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farmers Protest : కేంద్రంతో చర్చలకు రైతు సంఘాల సమాఖ్య అంగీకారం…వారు పంపిన ఎజెండాలోని అంశాలు ఇవే

కేంద్రంతో చర్చలకు రైతు సంఘాల సమాఖ్య అంగీకారం తెలిపింది. చర్చలకు తాము సిద్దంగా ఉన్నట్లు వివరించింది. డిసెంబర్ 29 న ఉదయం 11 గంటలకు చర్చలకు సిద్ధమని రైతు సంఘాలు ప్రకటించాయి.

Farmers Protest : కేంద్రంతో చర్చలకు రైతు సంఘాల సమాఖ్య అంగీకారం...వారు పంపిన ఎజెండాలోని అంశాలు ఇవే
Ram Naramaneni
|

Updated on: Dec 26, 2020 | 6:11 PM

Share

కేంద్రంతో చర్చలకు రైతు సంఘాల సమాఖ్య అంగీకారం తెలిపింది. చర్చలకు తాము సిద్దంగా ఉన్నట్లు వివరించింది. డిసెంబర్ 29 న ఉదయం 11 గంటలకు చర్చలకు సిద్ధమని రైతు సంఘాలు ప్రకటించాయి. ఈ మేరకు 40 రైతు సంఘాల తరుపున నాలుగు అంశాల ఎజెండాను కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్ కు రైతుల సంఘాల సమాఖ్య లేఖ ద్వారా పంపింది. తాము సూచించిన అంశాలపై చర్చించడానికి సుముఖంగా ఉన్నట్లు వెల్లడించింది.  ప్రభుత్వంతో మనసుపెట్టి చర్చలు జరిపేందుకు రైతు సంఘాలు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాయని రైతు సంఘాల సమాఖ్య పేర్కొంది. 

నాలుగు అంశాల ఎజెండా ప్రధానాంశాలు

1.మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి అనుసరించాల్సిన పద్ధతులపై చర్చ జరపాలి

2.అన్ని రకాల పంటలకు జాతీయ రైతు కమిషన్ సూచించిన లాభదాయకమైన MSPకి చట్ట బద్దత కల్పించడం

3. ఢిల్లీ రాజధాని పరిసర ప్రాంతాలలో వాయు నాణ్యత నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కమిషన్ ఆర్డినెన్స్ కు సవరణలు చేయాలి..ఆర్డినెన్స్ శిక్షా నిబంధనల నుండి రైతులను మినహాయించాలి

4. రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ‘విద్యుత్ సవరణ బిల్లు 2020’ ముసాయిదాలో అవసరమైన మార్పులు చేయడం పై చర్చ

Also Read :

Also Read :

Crime News : దొంగలేమో అనుకున్నారు..మూకుమ్మడిగా దాడిచేశారు..చివరికి ఊహించని విషాదం…

Raja singh VS Silpa Chakrapani: ‘ఎనీ టైమ్ నేను రెడీ..రాజీనామాకు నువ్వు రెడీనా’..రాజాసింగ్‏కు శిల్పా చక్రపాణి సవాల్