AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెజవాడలో నకిలీ పోలీసుల హల్‌చల్

విజయవాడలో నకిలీ పోలీసులు హల్‌చల్‌ చేశారు. గంజాయి వ్యసనపరుడిని కిడ్నాప్ చేసి తాము పోలీసులమని బెదిరించి.. మూడు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బెజవాడలో నకిలీ పోలీసుల హల్‌చల్
Ram Naramaneni
|

Updated on: Oct 30, 2020 | 5:25 PM

Share

విజయవాడలో నకిలీ పోలీసులు హల్‌చల్‌ చేశారు. గంజాయి వ్యసనపరుడిని కిడ్నాప్ చేసి తాము పోలీసులమని బెదిరించి.. మూడు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని బాధితుడు అసలు పోలీసులకు చెప్పడంతో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో దుర్గ గుడి చైర్మన్ పైలా సోమినాయుడు సోదరుడి కుమారుడు, ఏ. ఆర్ ఎస్.ఐ  తనయుడు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వారిని కేసు నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది.

కాగా విజయవాడలో గంజాయి వినియోగం పెరగినట్లు వార్తలు వస్తున్నాయి. యువత పెద్ద ఎత్తున గంజాయికి బానిస అయ్యిందని, బెజవాడలో చాలా ఈజీగా మత్తు పదార్థం దొరుకుతుందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు గంజాయి ముఠాలపై ఫోకస్ పెట్టి..యువతను పక్కదారి పట్టకుండా చూడాలని కోరుతున్నారు.

Also Read :

నీటి సంపులో పడి ఏడాదిన్నర పాప మృతి

జగ్గయ్యపేటలో భారీగా పట్టుబడ్డ అక్రమ మద్యం

Follow Us