AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బొగ్గు ‘మసి’, మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రే కి మూడేళ్ళ జైలుశిక్ష

1999 నాటి ఝార్ఖండ్ బొగ్గు కుంభకోణం కేసులో మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రే కి సీబీఐ స్పెషల్ కోర్టు మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. ఈయనను కోర్టు ఇటీవలే ఈ కేసులో దోషిగా నిర్ధారించింది.

బొగ్గు 'మసి', మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రే కి మూడేళ్ళ జైలుశిక్ష
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 26, 2020 | 12:22 PM

Share

1999 నాటి ఝార్ఖండ్ బొగ్గు కుంభకోణం కేసులో మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రే కి సీబీఐ స్పెషల్ కోర్టు మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. ఈయనను కోర్టు ఇటీవలే ఈ కేసులో దోషిగా నిర్ధారించింది. దిలీప్ రే తో బాటు మరో ఇద్దరికి కూడా మూడేళ్ళ జైలు శిక్ష పడింది. లోగడ ఏబీ వాజ్ పేయి ప్రభుత్వంలో బొగ్గు శాఖ సహాయమంత్రిగా వ్యవహరించిన దిలీప్.. బొగ్గు కేటాయింపుల్లో అవకతవకలకు, అక్రమాలకు, క్రిమినల్ కుట్రకు పాల్పడ్డారని, ఇందుకు గరిష్టంగా యావజ్జీవ జైలు శిక్ష సరైనదని న్యాయమూర్తి భరత్ పరాశర్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో సీబీఐ పిటిషన్ పై ఈ నెల 14 న విచారణ జరగగా, కోర్టు దీన్ని ఈ రోజుకు రిజర్వ్ చేసింది. వైట్ కాలర్ నేరాలు పెరిగి[పోతున్నాయని, నిందితులకు జీవిత ఖైదు  విధించడమే సరి అని కోర్టు పేర్కొంది.

Follow Us