ఇక పెద్ద ఎత్తున లాక్ డౌన్ సడలింపులు

ఇక పెద్ద ఎత్తున లాక్ డౌన్ సడలింపులు

ఒకవైపు కరోనా వైరస్ ఇంకా పూర్తిస్థాయిలో సమసి పోకముందే పలు యూరోపియన్ కంట్రీలలో లాక్ డౌన్ ఆంక్షలను ఎత్తివేయడం మొదలయ్యింది.

Rajesh Sharma

|

May 11, 2020 | 2:14 PM

ఒకవైపు కరోనా వైరస్ ఇంకా పూర్తిస్థాయిలో సమసి పోకముందే పలు యూరోపియన్ కంట్రీలలో లాక్ డౌన్ ఆంక్షలను ఎత్తివేయడం మొదలయ్యింది. మన దేశం లాగానే పలు యూరోపియన్ దేశాలు లాక్ డౌన్ ఆంక్షలను సడలించడం ద్వారా సాధారణమైన ప్రజా జీవనాన్ని అమల్లోకి తేవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ప్రజల రాకపోకలను, ఇతరత్రా దైనందిన కార్యక్రమాలను అనుమతిస్తున్నాయి యూరోపియన్ దేశాలు.

గత నాలుగు వారాలుగా ప్రత్యేకమైన అనుమతి పత్రాలను భర్తీ చేయడం ద్వారా మాత్రమే బయటకు వస్తున్న ఫ్రాన్స్ దేశస్థులకు.. ఇకపై ఎలాంటి అనుమతులు లేకుండా సంచరించే వెసులుబాటును ఆ దేశ ప్రభుత్వం కల్పించింది. కరోనా వైరస్ తీవ్రంగా ప్రభావం చూపిన స్పెయిన్ దేశంలో కూడా నిబంధనలను పెద్ద ఎత్తున సడలించారు. మాడ్రిడ్, బార్సిలోనా వంటి నగరాలలో బార్లు రెస్టారెంట్లు తెరచుకునేందుకు అనుమతించారు. అయితే వాటిని ఇన్ సైడ్ భవంతుల్లో కాకుండా ఓపెన్ ప్రాంతాలలో నిర్వహించాలని స్పెయిన్ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

కరోనా వైరస్ విపరీతంగా ప్రభావం చూపిస్తున్న యునైటెడ్ కింగ్ డం లోనూ లాక్ డౌన్ నిబంధనలను ఈ వారాంతంలో సడలించనున్నట్లు ఆ దేశ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రకటించారు. అయితే ఈ సడలింపుల తర్వాత అత్యంత జాగ్రత్తగా వ్యవహరించ వలసి ఉంటుందని ఆయన హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాలలో ఎక్కువ సమయం ఉండే వెసులుబాటును కల్పించనున్నట్లు తెలిపారు అయితే విదేశాల నుంచి వచ్చే వారు మాత్రం తప్పనిసరిగా క్వారెంటైన్ లో ఉండాలని సూచించారు.

మరోవైపు న్యూజిలాండ్ కూడా తమ దేశంలో లాక్ డౌన్ ఆంక్షలను ఎత్తివేస్తున్నట్టు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే కరోనా వైరస్ తొలిసారిగా వెలుగుచూసిన చైనా దేశంలో సోమవారం 17 కొత్త కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవడం ఆందోళన కలిగించే పరిణామమే. వరుసగా రెండో రోజు డబుల్ డిజిట్ గణాంకాలు చైనాలో నమోదయ్యాయి. వైరస్ ముందుగా జన్మించిందని భావిస్తున్న చైనాలోని ఊహన్ సిటీలో కొత్తగా 5 రికార్డయ్యాయి. దాంతో ఆ దేశంలో మరో సారి భయాందోళన చెలరేగుతోంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu