సీఎం జగన్ ఆదేశం.. రూ. కోటి విరాళం అందించిన మంత్రులు

ఎల్జీ గ్యాస్ లీక్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు సహాయం అందించారు ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అవంతి, ధర్మాన కష్ణదాస్ కోటి రూపాయల చెక్‌లను అందజేశారు. మృతి చెందిన కుటుంబ సభ్యులు కూడా ఇంకా కేజీహెచ్‌లోనే..

సీఎం జగన్ ఆదేశం.. రూ. కోటి విరాళం అందించిన మంత్రులు
Follow us

| Edited By:

Updated on: May 11, 2020 | 1:30 PM

ఎల్జీ గ్యాస్ లీక్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు సహాయం అందించారు ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అవంతి, ధర్మాన కష్ణదాస్ కోటి రూపాయల చెక్‌లను అందజేశారు. మృతి చెందిన కుటుంబ సభ్యులు కూడా ఇంకా కేజీహెచ్‌లోనే చికిత్స తీసుకుంటున్నారు. దీంతో అక్కడే వారికి చెక్కులను అందజేశారు మంత్రులు.

ఈ సందర్భంగా మంత్రి కన్న బాబు మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆదేశాల మేరకు చెక్కులు పంపిణీ చేశామన్నారు. అలాగే మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. కోటి అందించామన్నారు. 8 కుటుంబాలకు చెక్కులు అందించాం. అలాగే ఆస్పత్రిలో కోలుకున్న వారిని డిశ్చార్జ్ చేస్తున్నామన్నారు. డిశ్చార్జ్ అయిన వారికి సీఎం జగన్ ప్రకటించిన పరిహారం అందిస్తామన్నారు. బాధిత కుటుంబాల ఇంటి వద్దకే వెళ్లి పరిహారం ఇస్తామన్నారు. గ్యాస్ లీక్ ప్రభావం ఉన్న గ్రామాల్లో శానిటేషన్ చేస్తున్నాం. స్టైరిన్ గ్యాస్ ప్రస్తుతం పూర్తిగా అదుపులో ఉందన్నారు మంత్రి కన్నబాబు.

Read More: దిల్‌రాజు పెళ్లి ఫొటోలు.. మాతృదినోత్సవం రోజు కొత్త జీవితం