ఈఎస్ఐ స్కాంలో న్యూ ట్విస్ట్..స‌చివాలయ ఉద్యోగులు ఎస్కేప్..

ఏపీలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కాంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు దూకుడు పెంచారు. ఈ భారీ స్కామ్ లో కొందరు సచివాలయ ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు గుర్తించిన అధికారులు..మొత్తం 8 మంది ఈ స్కామ్ కు స‌హకరించిన‌ట్టు ప్రాథ‌మికంగా తేల్చారు.

ఈఎస్ఐ స్కాంలో న్యూ ట్విస్ట్..స‌చివాలయ ఉద్యోగులు ఎస్కేప్..
Follow us

|

Updated on: Jun 19, 2020 | 1:27 PM

ఏపీలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కాంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు దూకుడు పెంచారు. ఈ భారీ స్కామ్ లో కొందరు సచివాలయ ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు గుర్తించిన అధికారులు..మొత్తం 8 మంది ఈ స్కామ్ కు స‌హకరించిన‌ట్టు ప్రాథ‌మికంగా తేల్చారు. వారంతా ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. మొబైల్స్ కూడా స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా పోవ‌డంతో..కాల్ డేటా, సిగ్న‌ల్స్ ఆధారంగా వారిని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు అధికారులు.

కాగా సంబంధిత శాఖ ఉన్నతాధికారుల వద్దకు నోట్ ఫైల్ పంపకుండా ప్రక్రియ ముందుకు వెళ్లడానికి స‌చివాల‌య‌ ఉద్యోగులు కీలకపాత్ర పోషించారని ఏసీబీ అధికారుల నుంచి స‌మాచారం అందుతోంది. కాగా ఈఎస్ఐ స్కాంలో ఇప్పటి వరకు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సహా పలువురిని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు.