AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నలుగురు బైక్‌ దొంగలు అరెస్టు

ఖరీదైన బైక్‌లపై తిరుగుతూ.. చెడు అలవాట్లు, వ్యసనాలకు లోనైన నలుగురు యువకులు డబ్బు కోసం దొంగతనాలు చేయటం మొదలు పెట్టారు. కనిపించిన వాహనాలను చోరీ చేసి, వాటిని అమ్ముకుని వచ్చిన సొమ్ముతో జల్సా చేసేవారు. ఈ క్రమంలోనే వారు పోలీసులకు పట్టుబడ్డారు.

నలుగురు బైక్‌ దొంగలు అరెస్టు
Jyothi Gadda
| Edited By: |

Updated on: Jun 19, 2020 | 1:32 PM

Share

ఖరీదైన బైక్‌లపై తిరుగుతూ.. చెడు అలవాట్లు, వ్యసనాలకు లోనైన నలుగురు యువకులు డబ్బు కోసం దొంగతనాలు చేయటం మొదలు పెట్టారు. కనిపించిన వాహనాలను చోరీ చేసి, వాటిని అమ్ముకుని వచ్చిన సొమ్ముతో జల్సా చేసేవారు. ఈ క్రమంలోనే వారు పోలీసులకు పట్టుబడ్డారు. కడప జిల్లాకు చెందిన నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళితే..

కడప జిల్లాలోని దువ్వూరు మండల పరిధి ఏకోపల్లె గ్రామం వద్ద బుధవారం ఉదయం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలోనే చాగలమర్రి వైపు నుంచి దువ్వూరు వైపుకు రెండు ద్విచక్రవాహనాల్లో వచ్చిన నలుగురు యువకులు పోలీసుల తనిఖీని చూసి వెనుదిరిగి వేగంగా పారిపోయే ప్రయత్నం చేశారు. ఎస్‌ఐకి అనుమానం వచ్చి వెంబడించి వారిని పట్టుకున్నట్లు తెలిపారు. ఏకోపల్లె గ్రామ పెద్దమనుషుల సమక్షంలో పోలీసులు వారిని విచారించగా రెండు బైక్‌లను చోరీ చేశామని ఒప్పుకున్నారు. వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించగా రెండు బైక్‌లతోపాటు మరో 10 బైక్‌లను చోరీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. దువ్వూరు, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, మైదుకూరు, పెండ్లిమర్రి మండలంలోని పొలతలు, చాగలమర్రి, కృష్ణంపల్లె ఉరుసులో ఈ బైక్‌లను దొంగలించినట్లుగా తేల్చారు. 10 మోటార్‌ బైక్‌లను రాజుపాళెం మండలం గోపాయల్లె వద్ద స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీటి విలువ రూ.12 లక్షలు ఉంటుందని డీఎస్పీ పేర్కొన్నారు. పట్టుబడ్డ యువకులు కడప, కర్నూలు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్