AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: డ్యూటీ ఎక్కిన డిప్యూటీ సీఎం.. ఇక వారిపై ఉక్కుపాదమే..!

ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ అంశంపై అటవీ శాఖ అధికారులతో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించి, ఎర్రచందనం మాఫియా మూలాలను పూర్తిగా నిర్మూలించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై జీరో టాలరెన్స్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని, డ్రోన్లు, అత్యాధునిక సాంకేతికతతో నిఘాను మరింత పటిష్ఠం చేయాలని సూచించారు.

Deputy Cm Pawan Kalyan Review
Balaraju Goud
|

Updated on: Jul 23, 2026 | 8:45 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ అంశంపై అటవీ శాఖ అధికారులతో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించి, ఎర్రచందనం మాఫియా మూలాలను పూర్తిగా నిర్మూలించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై జీరో టాలరెన్స్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని, డ్రోన్లు, అత్యాధునిక సాంకేతికతతో నిఘాను మరింత పటిష్ఠం చేయాలని సూచించారు.

కేవలం స్మగ్లర్లపైనే కాకుండా, ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న కింగ్‌పిన్స్‌, ఫైనాన్షియర్లు, నెట్‌వర్క్ నిర్వాహకులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. దేశంలోని ఏ రాష్ట్రంలో ఎర్రచందనం దాచినా గుర్తించి స్వాధీనం చేసుకునేలా అంతర్రాష్ట్ర సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.

సమీక్షలో అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, గత రెండేళ్లలో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించి 506 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో 1,239 మందిని అరెస్ట్ చేయగా, 372 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన స్మగ్లర్లుగా గుర్తించిన 12 మందిపై పీడీ చట్టం కింద చర్యలు తీసుకున్నారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో 35.6 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో కన్విక్షన్ రేటు 95 శాతానికి పెరగడం శుభపరిణామమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, అంతర్రాష్ట్ర సమన్వయం, కఠిన చట్ట అమలుతో ఎర్రచందనం అక్రమ రవాణాకు పూర్తిగా చెక్ పెట్టాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అర టేబుల్ స్పూన్‌ తీసుకుంటే.. ఆస్తమా, శ్వాస సమస్యలు పూర్తి ఉపశమనం

తక్కువ ధరల్లో 100 అడుగుల కాంపౌండ్ వాల్‌ నిర్మాణానికి ఎంత ఖర్చు..?

తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్‌.. కొత్త అమృత్ భారత్ రైళ్లు..!

సేవింగ్స్ అకౌంట్‌లో ఏడాదికి ఎంత క్యాష్ డిపాజిట్ చేయవచ్చు?

ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ

MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం

గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న

ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!

ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..

గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..