AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆమని కెరీర్‌లో ఆ రెండు సినిమాలే టర్నింగ్ పాయింట్.. ఆ పాత్రను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఆమని ప్రస్తుతం బుల్లితెరపై వరుస సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తూ మరోసారి వెండితెరపై అలరిస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు

ఆమని కెరీర్‌లో ఆ రెండు సినిమాలే టర్నింగ్ పాయింట్.. ఆ పాత్రను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను
Aamani
Rajeev Rayala
|

Updated on: Oct 04, 2026 | 6:07 PM

Share

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని సీనియర్ నటి ఆమని. హీరోయిన్‌గా ఒకప్పుడు వరుస విజయాలను అందుకున్న ఆమె.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. సహజమైన నటన, భావోద్వేగాలను పండించే తీరు, పాత్రకు తగ్గట్టుగా తనను తాను మార్చుకునే విధానం ఆమనికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఆమె పంచుకున్నారు. ఆమని కెరీర్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమాల్లో శుభలగ్నం ఒకటి. ఈ సినిమాలో ఆమె పోషించిన పాత్ర ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసింది. సాధారణంగా తాను ఎలా ఉంటానో, తెరపై కనిపించిన పాత్రకు దానికి ఎలాంటి సంబంధం లేదని.. నటిగా ఏ పాత్ర ఇచ్చినా దానికి తగ్గట్టుగా నటించాల్సిందేనని ఆమని చెప్పుకొచ్చారు.

చిరంజీవి, వెంకటేష్‌లతో కనిపించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా.? సోషల్ మీడియాను ఊపేస్తుందిగా..

ఈ సినిమాలో తన పాత్ర స్వభావం అప్పట్లో ప్రేక్షకుల్లో పెద్ద చర్చకు దారితీసిందని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ తాను ఎక్కడికి వెళ్లినా శుభలగ్నం సినిమా పేరు ప్రస్తావనకు వస్తుంటుందని తెలిపారు. ముఖ్యంగా జగపతి బాబుతో తన కాంబినేషన్, సినిమాలోని సన్నివేశాలు ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుండిపోవడం తనకు సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పారు. ఇటీవల దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తనకు ఫోన్ చేసి, సినిమాలో తన నటన గురించి ప్రశంసించడం కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆమని వెల్లడించారు.

ఎవర్రా నువ్వు..! బర్త్ డే రోజున హీరోయిన్‌కి షాక్ ఇచ్చిన అభిమాని.. నెటిజన్స్ కామెంట్స్ మాత్రం నెక్స్ట్ లెవల్

శుభలగ్నం తర్వాత తన నటనా ప్రతిభను మరో కోణంలో చూపించిన చిత్రం మావిచిగురు అని ఆమని పేర్కొన్నారు. ఈ సినిమాలోని పాత్ర చాలా లోతైన భావోద్వేగాలతో కూడుకున్నదని, ప్రతి సన్నివేశాన్ని పండించేందుకు తాను చాలా కష్టపడాల్సి వచ్చిందని తెలిపారు. ముఖ్యంగా సినిమాలోని ఎమోషనల్ సన్నివేశాలు తనపై ఎంతో ప్రభావం చూపించేవని ఆమని గుర్తుచేసుకున్నారు. కొన్ని సన్నివేశాల్లో సహజంగా ఏడ్చేందుకు ప్రయత్నించడంతో షూటింగ్ పూర్తయ్యే సమయానికి తీవ్రంగా అలసిపోయేదాన్నని చెప్పారు. గ్లిజరిన్‌ను ఉపయోగించడం కంటే నిజమైన భావోద్వేగంతో కన్నీళ్లు తెప్పించుకోవడానికి ప్రయత్నించేదాన్నని, దాని వల్ల ఒక్కోసారి తలనొప్పి కూడా వచ్చేదని తెలిపారు. మావిచిగురు’లోని క్లైమాక్స్ తనకు ఇప్పటికీ ఎంతో ప్రత్యేకమని, ఆ పాత్రలో నటించిన అనుభవం తన సినీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిదని ఆమని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

10th క్లాస్ మూడుసార్లు ఫెయిల్ అయ్యా.. ఖచ్చితంగా డైరెక్టర్ అవుతానంటున్న స్టార్ హీరో కూతురు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us