తెలంగాణలో మళ్లీ ఎన్నికల కోలాహలం
తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. వాటి నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈ నెల 20న ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ్వనుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 22న మొదటి విడత, 26న రెండో విడత, 30న మూడో విడత నోటిఫికేషన్ వెలువడనుంది. అలాగే మే 6న మొదటి విడత, మే 12న రెండో విడత, మే 14న మూడో […]

తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. వాటి నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈ నెల 20న ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ్వనుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 22న మొదటి విడత, 26న రెండో విడత, 30న మూడో విడత నోటిఫికేషన్ వెలువడనుంది. అలాగే మే 6న మొదటి విడత, మే 12న రెండో విడత, మే 14న మూడో విడత పోలింగ్ జరగనుంది. ఇక మొదటి విడతలో 212 జడ్పీటీసీ, 2365 ఎంపీటీసీ స్థానాలకు.. రెండో విడతలో 199 జడ్పీటీసీ, 2109 ఎంపీటీసీ స్థానాలకు.. మూడో విడతలో 124 జడ్పీటీసీ, 1343 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.



