AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీవీఎల్‌పై చెప్పు విసిరిన డాక్టర్

న్యూఢిల్లీ : ఢిల్లీలో తమ పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతున్న బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు చేదు అనుభవం ఎదురైంది. ఆయనపై ఓ వ్యక్తి చెప్పు విసరడంతో.. షాక్ తిన్నారు. వెంటనే పోలీసులు చెప్పు విసిరిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా చెప్పు విసిరిన వ్యక్తిని కాన్పూర్‌కు చెందిన డాక్టర్‌ శక్తి భార్గవ్‌గా గుర్తించారు. తాను హిందు ఉగ్రవాదంపై మాట్లాడుతుండగా ఈ ఘటన జరిగిందని.. ఆ తర్వాత జీవీఎల్ మీడియాకు తెలిపారు. అయితే ఇలాంటి ఘటనలకు […]

జీవీఎల్‌పై చెప్పు విసిరిన డాక్టర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 18, 2019 | 5:17 PM

Share

న్యూఢిల్లీ : ఢిల్లీలో తమ పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతున్న బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు చేదు అనుభవం ఎదురైంది. ఆయనపై ఓ వ్యక్తి చెప్పు విసరడంతో.. షాక్ తిన్నారు. వెంటనే పోలీసులు చెప్పు విసిరిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా చెప్పు విసిరిన వ్యక్తిని కాన్పూర్‌కు చెందిన డాక్టర్‌ శక్తి భార్గవ్‌గా గుర్తించారు. తాను హిందు ఉగ్రవాదంపై మాట్లాడుతుండగా ఈ ఘటన జరిగిందని.. ఆ తర్వాత జీవీఎల్ మీడియాకు తెలిపారు. అయితే ఇలాంటి ఘటనలకు తాను భయపడే ప్రసక్తే లేదని అన్నారు. ఈ ఘటన వెనక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉండవచ్చని అన్నారు. కాగా శక్తి భార్గవ్ బీజేపీ సీనియర్ నేత అద్వానీ అభిమాని అని, ఆయనకు ఎన్నికల్లో పార్టీ టిక్కెట్టు తిరస్కరించడంతో ఆగ్రహంతోనే ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు.