ఉసిరికాయతో పాటు దాని గింజలు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ సి, బి, పొటాషియం వంటి పోషకాలతో సమృద్ధిగా ఉండే ఉసిరి గింజల పొడి జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది, బరువు తగ్గడంలో సహాయపడుతుంది, మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. దీని పేస్ట్ చర్మ సమస్యలకు కూడా మేలు చేస్తుంది.