AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Veg Biryani: వెజ్ బిర్యానీ తినాలని ఉందా? పక్కా కొలతలతో హోటల్ స్టైల్ వెజ్ బిర్యానీని ఇంట్లోనే చేసుకోండిలా

వెజ్ బిర్యానీ అంటే కేవలం అన్నం, కూరగాయల మిశ్రమం మాత్రమే కాదు.. అది అద్భుతమైన రుచుల కలయిక! మటన్, చికెన్ బిర్యానీలకు ఏమాత్రం తీసిపోని విధంగా, శాఖాహారుల కోసం నోరూరించే వెజ్ బిర్యానీ రెసిపీని తెలుసుకుందాం. నాన్ వెజ్ తినని రోజుల్లో ఏదైనా స్పెషల్ అకేషన్స్ లో మీ కుటుంబ సభ్యులకు లేదా అతిథులకు ఈ స్పెషల్ డిష్ వడ్డిస్తే లొట్టలేసుకుని తింటారు.

Veg Biryani: వెజ్ బిర్యానీ తినాలని ఉందా? పక్కా కొలతలతో హోటల్ స్టైల్ వెజ్ బిర్యానీని ఇంట్లోనే చేసుకోండిలా
Veg Biryani Special Recipe
Bhavani
|

Updated on: Apr 18, 2026 | 4:03 PM

Share

బిర్యానీ అనగానే చాలామందికి మాంసాహారమే గుర్తుకు వస్తుంది. అయితే మన దేశంలో అత్యధిక జనాభా శాఖాహారమే తీసుకుంటారు. మాంసాహార బిర్యానీకి ఉండే ప్రత్యేక రుచి వెజ్ బిర్యానీలో ఉండదని అనుకుంటే అది పొరపాటే. సరైన పద్ధతిలో వండితే, కూరగాయలతో చేసే బిర్యానీ కూడా అద్భుతమైన రుచిని ఘాటైన సువాసనను అందిస్తుంది. మీరు ఇంతకుముందు ఎప్పుడూ వంట చేయకపోయినా సరే, ఈ సులభమైన చిట్కాలను పాటిస్తూ అతి తక్కువ సమయంలోనే అదిరిపోయే వెజ్ బిర్యానీని సిద్ధం చేయవచ్చు.

కావాల్సిన పదార్థాలు:

ఉడికించిన అన్నం – 2 కప్పులు

మిశ్రమ కూరగాయల ముక్కలు (క్యారెట్, బీన్స్, బంగాళదుంప మొదలైనవి) – 3 కప్పులు

పసుపు – 1/2 టీస్పూన్

ధనియాల పొడి – 2 టీస్పూన్లు

తరిగిన ఉల్లిపాయలు – 1/4 కప్పు

అల్లం తురుము – 1 టీస్పూన్

వెల్లుల్లి రెబ్బలు – 5-6 (సన్నగా తరిగినవి)

పచ్చిమిర్చి – 1-2

జీలకర్ర – 1 టీస్పూన్

కారం – 1/2 టీస్పూన్

గరం మసాలా – 1/2 టీస్పూన్

బిర్యానీ మసాలా – 1 టీస్పూన్

నిమ్మరసం – 1 టీస్పూన్

నూనె – సరిపడా

ఉప్పు – రుచికి సరిపడా

కొత్తిమీర – 2-3 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం: మొదట ఒక గిన్నె తీసుకుని, అందులో బియ్యాన్ని వేసి ఉడికించుకోవాలి. అన్నం ఉడుకుతున్న సమయంలోనే తాజా కూరగాయలను చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి కొత్తిమీరను కూడా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేడి చేసి, అందులో ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత మిగిలిన కూరగాయ ముక్కలను కూడా వేసి బాగా వేయించుకోవాలి.

కూరగాయలు వేగిన తర్వాత పసుపు, ధనియాల పొడి, కారం రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం పూర్తిగా ఉడికిన తర్వాత దానిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాణలిలో కొంచెం కూరగాయల మిశ్రమం ఉంచి, దానిపై ఒక పొరలా అన్నాన్ని పరవాలి. ఆ అన్నం పైన మళ్ళీ కూరగాయల మిశ్రమాన్ని, దానిపై చివరిగా మిగిలిన అన్నాన్ని వేసి పైన మూత పెట్టాలి. మంటను మధ్యస్థంగా ఉంచి మరో 5 నుండి 7 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా వడ్డించాలి. దీనిని రైతాతో కలిపి తింటే రుచి ఇంకా అద్భుతంగా ఉంటుంది.

Follow Us
వాకింగ్ ఒక్కటే కాదు.. శరీరం ఫిట్‌గా ఉండడానికి అసలైన సీక్రెట్ ..
వాకింగ్ ఒక్కటే కాదు.. శరీరం ఫిట్‌గా ఉండడానికి అసలైన సీక్రెట్ ..
కుమారీ ఆంటీ బంపరాఫర్..ఈ సినిమా టికెట్ చూపిస్తే బిల్లుపై డిస్కౌంట్
కుమారీ ఆంటీ బంపరాఫర్..ఈ సినిమా టికెట్ చూపిస్తే బిల్లుపై డిస్కౌంట్
ఉద్యోగం చేసే ఆడవాళ్ళతో పాటు అన్ని వయసుల వాళ్ళు తినాల్సిన అప్పాలు
ఉద్యోగం చేసే ఆడవాళ్ళతో పాటు అన్ని వయసుల వాళ్ళు తినాల్సిన అప్పాలు
ఆగస్టు 14 రాశిఫలాలు: వారికి ఉద్యోగంలో కీలక మార్పులు..
ఆగస్టు 14 రాశిఫలాలు: వారికి ఉద్యోగంలో కీలక మార్పులు..
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..
అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..
ఏళ్ల తరబడి స్మోకింగ్ చేసినా క్యాన్సర్ రాలేదా?.. అసలు కారణం ఇదేనట!
ఏళ్ల తరబడి స్మోకింగ్ చేసినా క్యాన్సర్ రాలేదా?.. అసలు కారణం ఇదేనట!
స్కాన్‌ చేయాలంటే.. కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?
స్కాన్‌ చేయాలంటే.. కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?
చంటి పిల్లలకు విటమిన్‌-ఏ ఎందుకు వేస్తారు?.. వేయకుంటే ఏమవుతుంది?
చంటి పిల్లలకు విటమిన్‌-ఏ ఎందుకు వేస్తారు?.. వేయకుంటే ఏమవుతుంది?
గ్రామ సింహానికే సవాల్‌..! కోడిపుంజు ధైర్యానికి షాకైన నెటిజన్లు..
గ్రామ సింహానికే సవాల్‌..! కోడిపుంజు ధైర్యానికి షాకైన నెటిజన్లు..