బ్లాక్ కిస్మిస్లు రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇవి అధిక రక్తపోటును నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు కళ్లకు మేలు చేస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. విటమిన్ సి జుట్టు సమస్యలు తగ్గించగా, పొటాషియం, కాల్షియం ఎముకలను దృఢపరుస్తాయి.