కాంగ్రెస్, జేడీఎస్ పొత్తు.. బీజేపీకి లాభమా.?

గత లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ పరిమిత సీట్లలో గెలుపొందిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సోలోగా అధికారాన్ని అనుభవించింది. ఇక గత ఏడాదిలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. అయితే చివరి క్షణంలో జేడీఎస్ తో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు జరుగుతున్న లోక్ సభ ఎన్నికలకు కూడా కాంగ్రెస్- జేడీఎస్ లు అదే పొత్తును కొనసాగిస్తూ ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్- […]

కాంగ్రెస్, జేడీఎస్ పొత్తు.. బీజేపీకి లాభమా.?
Follow us

|

Updated on: Apr 18, 2019 | 9:01 PM

గత లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ పరిమిత సీట్లలో గెలుపొందిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సోలోగా అధికారాన్ని అనుభవించింది. ఇక గత ఏడాదిలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. అయితే చివరి క్షణంలో జేడీఎస్ తో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు జరుగుతున్న లోక్ సభ ఎన్నికలకు కూడా కాంగ్రెస్- జేడీఎస్ లు అదే పొత్తును కొనసాగిస్తూ ఉన్నాయి.

మరోవైపు కాంగ్రెస్- జేడీఎస్ ల పొత్తుతో.. కర్ణాటక లోని ఇరవై ఎనిమిది ఎంపీ సీట్లలో కనీసం పదిహేడు ఎంపీ సీట్లను ఆ కూటమి కైవసం చేసుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే అది జరిగే పనిలా మాత్రం కనిపించడం లేదని  పార్టీ వర్గాల్లో కొందరి వాదన.  పేరుకు వారిద్దరి మధ్య పొత్తు ఉంది గానీ..కాంగ్రెస్, జేడీఎస్ కార్యకర్తలు ఒకరినొకరు సహకరించుకునే అవకాశాలు ఎక్కడా కనిపించట్లేదని అంటున్నారు.

కాంగ్రెస్ బలంగా ఉన్న కొన్ని సీట్లు జేడీఎస్ కు కేటాయించారు. అలాంటి చోట్ల ఆ పార్టీ నుంచి తిరుగుబాటు దార్లు రంగంలో ఉన్నారు. ఇక జేడీఎస్- కాంగ్రెస్ లు దశాబ్దాలుగా రాజకీయ వైరంతో మెలిగిన విషయాన్ని మర్చిపోకూడదు. ఏదో హంగ్ తరహా పరిస్థితి రావడంతో అధికారం కోసం చేతులు కలిపారు తప్ప వారి కార్యకర్తలు పూర్తి స్థాయిలో కలిసి పని చేసేలా కనిపించట్లేదు.

దీనితో ఇరు పార్టీలకు అనుకున్న ఫలితం రాకపోవచ్చని అంచనా. అంతేకాదు బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు చేతులు కలిపాయని ఇప్పటికే ప్రజలు భావిస్తున్నారు. ఒకప్పుడు ఇరువురు శత్రువులు మాదిరి మెలిగి.. ఇప్పుడు ఆ గొడవలు ఏమి లేవని బీజేపీ కోసం చేతులు కలిపి అవకాశవాదాన్ని పైకి నటిస్తున్నాయని జనాలు భావిస్తున్నారు. మరి ఆ లెక్కలు బీజేపీ మీద సానుభూతిని కలిగించాయంటే.. మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది.

కాంగ్రెస్-జేడీఎస్ లు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన బలాబలాలను బట్టి అవి మెజారిటీ ఎంపీ సీట్లను నెగ్గాలి. కానీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇరు పార్టీలు కలిసిన తీరుపై జనాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనితో బీజేపీ మెజారిటీ సీట్లు గెలుస్తుందని అంచనా. అయితే బీజేపీకీ మైనస్ లు లేకపోలేదు. యడ్యూరప్ప ఆడియో టేపులు బీజేపీకి నష్టం చేకూరుస్తుయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.