AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.25 వేల కోట్ల స్కామ్ లో అజిత్ పవార్ కి క్లీన్ చిట్, ఈడీ అభ్యంతరం

25 వేల కోట్ల బ్యాంక్ స్కామ్ లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కి, మరికొందరికి  ముంబై పోలీసులు క్లీన్ చిట్ ఇవ్వడంపట్ల ఈడీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకుకు సంబంధించిన....

రూ.25 వేల కోట్ల స్కామ్ లో అజిత్ పవార్ కి క్లీన్ చిట్, ఈడీ అభ్యంతరం
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 27, 2020 | 1:15 PM

Share

25 వేల కోట్ల బ్యాంక్ స్కామ్ లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కి, మరికొందరికి  ముంబై పోలీసులు క్లీన్ చిట్ ఇవ్వడంపట్ల ఈడీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకుకు సంబంధించిన ఈ కుంభకోణం గత ఏడాది రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపింది. ఈ కేసులో అజిత్ పవార్ కి, ఇతరులకు పోలీసులు ఇచ్చిన క్లీన్ చిట్ ను ఆమోదించరాదని ఈడీ ముంబై కోర్టును కోరింది. ఒకవేళ పోలీస్ క్లోజర్ రిపోర్టును కోర్టు అంగీకరించిన పక్షంలో  అజిత్ పై గల మనీలాండరింగ్ కేసు కూడా క్లోజయినట్టే అని ఈ సంస్థ పేర్కొంది. కాగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహా ఈ పార్టీకి చెందిన 70 మందికి పైగా లీడర్లపై కేసులు ఉన్నట్టు గత ఏడాది అధికారులు తెలిపారు.

Follow Us