జగన్ పన్నిన ఉచ్చులో బొల్లినేని శ్రీనివాస్ గాంధీ..?

ఈడీ మాజీ అధికారి బొల్లినేని శ్రీనివాస్ గాంధీకి ఉచ్చు బిగుసుకుంటోంది. ఆయనపై ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు. శ్రీనివాస్ భారీ ఎత్తున మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు గుర్తించిన ఈడీ అధికారులు.. ఈ నెల 8న ఆయనపై కేసు నమోదు చేసి.. ఆస్తులపై దాడులు జరిపారు. ఈ క్రమంలో రూ.200కోట్ల విలువైన అక్రమాస్తులను సీబీఐ అధికారులు గుర్తించారు. దీనిపై ఈడీ విచారణను వేగవంతం చేసింది. కాగా 2010 నుంచి 2019వరకు శ్రీనివాసగాంధీ ఈడీలో పనిచేశారు. […]

జగన్ పన్నిన ఉచ్చులో బొల్లినేని శ్రీనివాస్ గాంధీ..?
Follow us

| Edited By:

Updated on: Jul 24, 2019 | 11:20 AM

ఈడీ మాజీ అధికారి బొల్లినేని శ్రీనివాస్ గాంధీకి ఉచ్చు బిగుసుకుంటోంది. ఆయనపై ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు. శ్రీనివాస్ భారీ ఎత్తున మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు గుర్తించిన ఈడీ అధికారులు.. ఈ నెల 8న ఆయనపై కేసు నమోదు చేసి.. ఆస్తులపై దాడులు జరిపారు. ఈ క్రమంలో రూ.200కోట్ల విలువైన అక్రమాస్తులను సీబీఐ అధికారులు గుర్తించారు. దీనిపై ఈడీ విచారణను వేగవంతం చేసింది.

కాగా 2010 నుంచి 2019వరకు శ్రీనివాసగాంధీ ఈడీలో పనిచేశారు. ఆ తరువాత జీఎస్టీలో పనిచేసిన ఆయన.. సుజనాచౌదరి జీఎస్టీ ఎగవేత కేసును పర్యవేక్షించారు. అయితే సుజనాకు అనుకూలంగా వ్యవహరించి భారీగా లబ్ధిపొందినట్లు ఈయనపై ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో శ్రీనివాసగాంధీ అక్రమాస్తులను ఎటాచ్ చేయనున్న ఈడీ..విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది.

ఇదిలా ఉంటే ఈడీ అసిస్టెంట్ డైరక్టర్‌ హోదాలో ఉన్న సమయంలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న బొల్లినేని గాంధీ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని అప్పట్లో జగన్ ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు లేఖ రాసి అందులో.. ఈడీ కేసులతో ఏ మాత్రం సంబంధం లేని తన భార్య భారతికి కూడా నోటీసులు జారీ చేశారని ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని.. అప్పట్లో మోదీతో జగన్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. కాగా జగన్ ఆరోపణల కారణంగానే గాంధీ జీఎస్టీకి బదిలీ అయ్యారని నాడు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.