మున్సిపల్ ఎన్నికల్లో బాబు, పవన్ మిలాఖత్ ! తాజా వ్యూహం ఫలించేనా ?
తెలంగాణాలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుని పోటీ చేయనున్నాయా ? గతాన్ని మరచి ‘ చేతులు కలపనున్నాయా ‘ ? ఓ ఇంగ్ల్లీష్ డైలీలో వచ్చిన కథనం ప్రకారం..వైసీపీ ‘ ప్రాబల్యం ‘ పెరగకుండా, ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రయోజనం పొందకుండా చూడాలంటే.. ఇలాంటి వ్యూహం అనుసరించాల్సిందేనని టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు యోచిస్తున్నారట ఈ దిశగా జనసేనాని పవన్ కళ్యాణ్ తో ప్రాథమిక చర్చలు జరపాలని ఆయన భావిస్తున్నట్టు […]
తెలంగాణాలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుని పోటీ చేయనున్నాయా ? గతాన్ని మరచి ‘ చేతులు కలపనున్నాయా ‘ ? ఓ ఇంగ్ల్లీష్ డైలీలో వచ్చిన కథనం ప్రకారం..వైసీపీ ‘ ప్రాబల్యం ‘ పెరగకుండా, ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రయోజనం పొందకుండా చూడాలంటే.. ఇలాంటి వ్యూహం అనుసరించాల్సిందేనని టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు యోచిస్తున్నారట ఈ దిశగా జనసేనాని పవన్ కళ్యాణ్ తో ప్రాథమిక చర్చలు జరపాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఘోర ఓటమిని చవి చూశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓడిపోగా, ఈ పార్టీకి చెందిన ఒకే ఒక్క అభ్యర్థి విజయం సాధించారు. ఆ ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పవన్ కళ్యాణ్.. తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. ముఖ్యంగా ఏపీలో మళ్ళీ పర్యటనలపై ఆయన దృష్టి పెట్టారు. ఒకవేళ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అధినేత నుంచి ‘ పొత్తు ‘ విషయంపై ప్రతిపాదన వస్తే దానిని పరిశీలించేందుకు ఆయన సిధ్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. నిజానికి టీడీపీ, జనసేన మధ్య రాజకీయంగా శత్రుత్వమేమీ లేదు.
సిధ్ధాంతపరంగా ఈ పార్టీల మధ్య విభేదాలు ఉండవచ్ఛేమో గానీ, పొత్తు పెట్టుకోరాదన్నంతగా పరస్పర వైరుధ్యాలేవీ లేనట్టే.. ఒకప్పుడు ఈ పార్టీలు రెండూ కలిసికట్టు వ్యూహాలతో ముందుకు సాగాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మంచి పొలిటికల్ ఫ్రెండ్స్ లా మెలిగారు. అయితే ఆ తరువాత పార్టీల పరంగా ‘ చీలిపోయారు ‘. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలన్న ప్రతిపాదన అంశం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ..