లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్‌కు ఈడీ భారీ షాక్

2008 ముంబై పేలుళ్ల సూత్రధారి, లష్కరే తాయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ షాకిచ్చింది. గురుగ్రామ్‌లో హఫీజ్‌కు చెందిన కోట్ల రూపాయల విలువైన విల్లాను అటాచ్ చేసినట్టు తెలుస్తోంది. హఫీజ్ సయీద్‌కు నిధులు సరఫరా చేస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కశ్మీర్‌కు చెందిన వ్యాపారవేత్త జహూర్ అహ్మద్ షా వటాలి దీనిని కొనుగోలు చేశాడు. టెర్రర్ ఫండింగ్ కేసులో వటాలీని గతేడాది ఆగస్టులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. గురుగ్రామ్ విల్లాను […]

లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్‌కు ఈడీ భారీ షాక్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 12, 2019 | 6:16 PM

2008 ముంబై పేలుళ్ల సూత్రధారి, లష్కరే తాయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ షాకిచ్చింది. గురుగ్రామ్‌లో హఫీజ్‌కు చెందిన కోట్ల రూపాయల విలువైన విల్లాను అటాచ్ చేసినట్టు తెలుస్తోంది. హఫీజ్ సయీద్‌కు నిధులు సరఫరా చేస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కశ్మీర్‌కు చెందిన వ్యాపారవేత్త జహూర్ అహ్మద్ షా వటాలి దీనిని కొనుగోలు చేశాడు. టెర్రర్ ఫండింగ్ కేసులో వటాలీని గతేడాది ఆగస్టులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. గురుగ్రామ్ విల్లాను పాకిస్థాన్‌కు చెందిన ట్రస్టు ఫలాహీ ఇన్సానియత్ ఫౌండేషన్ (ఎఫ్ఐఎఫ్) సమకూర్చిన నిధులతో వటాలీ ఈ విల్లాను కొనుగోలు చేసినట్టు ఈడీ భావిస్తోంది. ఈ సంస్థ సయీద్ ఆధ్వర్యంలోనే పనిచేస్తోంది. భారత్‌లో ఉగ్రదాడుల కోసం యూఏఈ నుంచి హవాలా ద్వారా ఈ నిధులు భారత్‌కు వచ్చినట్టు దర్యాప్తు సంస్థ భావిస్తోంది.