ఏప్రిల్ 6 నుంచి భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామివారి బ్రహ్మోత్సవాలు

ప్రసిద్ధ‌ పుణ్యక్షేత్రం భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామివారి బ్రహ్మోత్సవాలు ఛైత్రశుద్ధ పాడ్యమి ఉగాది రోజున (ఏప్రిల్ 6) ప్రారంభమైన ఏప్రిల్ 20 వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు ఆలయ వేద పండితులు, ఆర్చకులు ముహుర్తం ఖరారు చేశారు. ఏప్రిల్‌ 6 నుంచి 20 వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 14న నవమి రోజున సీతారాముల కల్యాణం, 15న మహా పట్టాభిషేకం జరగనుంది. సీతారాముల కల్యాణం భక్తులు తిలకించేందుకు మిథిలా ప్రాంగణంలో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రూ.5 […]

ఏప్రిల్ 6 నుంచి భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామివారి బ్రహ్మోత్సవాలు
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:59 PM

ప్రసిద్ధ‌ పుణ్యక్షేత్రం భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామివారి బ్రహ్మోత్సవాలు ఛైత్రశుద్ధ పాడ్యమి ఉగాది రోజున (ఏప్రిల్ 6) ప్రారంభమైన ఏప్రిల్ 20 వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు ఆలయ వేద పండితులు, ఆర్చకులు ముహుర్తం ఖరారు చేశారు. ఏప్రిల్‌ 6 నుంచి 20 వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 14న నవమి రోజున సీతారాముల కల్యాణం, 15న మహా పట్టాభిషేకం జరగనుంది. సీతారాముల కల్యాణం భక్తులు తిలకించేందుకు మిథిలా ప్రాంగణంలో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రూ.5 వేలు, రూ.2 వేలు, తదితర టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచారు. సీతారాముల కల్యాణాన్ని వీక్షించే భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు.

ఏప్రిల్ 14న కల్యాణానికి వైదిక కమిటీ ముహూర్తం నిర్ణయించడంతో శ్రీరామనవమిని పురస్కరించుకొని తిరు కల్యాణ బ్రహోత్సవాల షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. ఏప్రిల్ 6 నుంచి 20 వరకు వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఏప్రిల్ 6న వికారి నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని నూతన పంచాంగ శ్రవణం, ఆస్థానం, తిరువీధి సేవలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 10న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం, మండప వాస్తు హోమం, ఏప్రిల్ 11న గరుడ పట లేఖణం, గరుట పట అదివాసం, 12న అగ్ని ముఖం, అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, దేవతావాహణం, 13న ఎదుర్కోలు ఉత్సవం, గరుడ సేవ 14న శ్రీసీతారాముల కల్యాణం, 15న మహాపట్టాభిషేకం, 16న సదస్యం, 20న ధ్వజారోహణం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.