‘బోయింగ్‌ 737 మాక్స్‌’లను నిషేదించిన పలు దేశాలు

డిల్లీ: ‘బోయింగ్‌ 737 మాక్స్‌’లను పక్కన పెట్టిన జాబితాలో మంగళవారం భారత్‌, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ కూడా చేరాయి. ‘‘ఈ విమానాలను తక్షణమే విమానాశ్రయాలకు పరిమితం చేయాలని డీజీసీఏ నిర్ణయించింది. ప్రయాణికుల భద్రతే అతిముఖ్యం. భద్రతాపరంగా అన్నీ పరిశీలించే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది’’ కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ ట్వీట్‌ చేసింది. మనదేశంలో స్పైస్‌జెట్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ ఈ రకం విమానాలను కలిగి ఉన్నాయి. మరోవైపు తమ దేశంలోగాని, తమ దేశం పరిధిలోని ఆకాశంలోగాని స్వదేశీ, […]

‘బోయింగ్‌ 737 మాక్స్‌’లను నిషేదించిన పలు దేశాలు
Follow us

|

Updated on: Mar 13, 2019 | 7:29 AM

డిల్లీ: ‘బోయింగ్‌ 737 మాక్స్‌’లను పక్కన పెట్టిన జాబితాలో మంగళవారం భారత్‌, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ కూడా చేరాయి. ‘‘ఈ విమానాలను తక్షణమే విమానాశ్రయాలకు పరిమితం చేయాలని డీజీసీఏ నిర్ణయించింది. ప్రయాణికుల భద్రతే అతిముఖ్యం. భద్రతాపరంగా అన్నీ పరిశీలించే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది’’ కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ ట్వీట్‌ చేసింది. మనదేశంలో స్పైస్‌జెట్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ ఈ రకం విమానాలను కలిగి ఉన్నాయి. మరోవైపు తమ దేశంలోగాని, తమ దేశం పరిధిలోని ఆకాశంలోగాని స్వదేశీ, విదేశీ విమానయాన సంస్థలకు చెందిన 737 మాక్స్‌ విమానాలు ఎగరడానికి వీల్లేదని బ్రిటన్‌ పౌర విమానయాన సంస్థ ఆదేశించింది. ఐరోపా సమాఖ్య కూడా తమ గగనతలంలో ఈ శ్రేణి విమానాలను నిషేధించింది. సింగపూర్‌, చైనా, మలేసియా, ఇథియోపియా, ఆస్ట్రేలియా దేశాలూ సోమవారం నుంచి తాత్కాలికంగా విమానాశ్రయాలకే పరిమితం చేశాయి. రీసెంట్‌గా ఇథియోథోపియాలో బోయింగ్ 737 మాక్స్‌ కూలిపోయి 157 మంది చనిపోవడంతో అన్ని దేశాలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన