మొరాయించిన ఈవీఎంలు.. కౌంటింగ్ కు అలస్యం..!
దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి మంగళవారం కౌంటింగ్ జరుగుతోంది. మొదటి నుంచి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యంలో కొనసాగుతూ వస్తున్నారు.
దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి మంగళవారం కౌంటింగ్ జరుగుతోంది. మొదటి నుంచి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యంలో కొనసాగుతూ వస్తున్నారు. 19వ రౌండ్ తర్వాత టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత కొంత ఆధిక్యంలోకి వచ్చారు. మిగిలిన రౌండ్లపై రెండు పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. ఇక తమ మెజారిటీ కొనసాగుతుందని, మిగిలిన రౌండ్లు తమవేనంటూ, విజయం సాధిస్తామంటూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. 20 వ రౌండ్ పూర్తవ్వగానే కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత కౌటింగ్ హాల్ నుంచి వెనుతిరిగారు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన కౌటింగ్ భారతీయ జనతాపార్టీ 1,118 ఓట్లతో దుబ్బాకలో ఘన విజయం సాధించింది.
కాగా, పలు గ్రామాల్లో ఓట్ల లెక్కింపుకు కాస్త అలస్యం అయ్యింది. ఈవీఎంలు మొరాయించడంతో లెక్కింపునకు అంతరాయం ఏర్పడింది. దుబ్బాక మండలం పోతారెడ్డిపేట – 413 ఓట్లు, తొగుట మండలం ఏటీగడ్డ కిష్టపూర్ – 583, దౌల్తాబాద్ మండలం సూరం పల్లి లో – 314, అరెపల్లి లో – 339 ఓట్లు ఉన్నాయి. ఈ ఈవీఎంలు ఓపెన్ కాలేదు. సాంకేతిక సమస్య ఉంది. తెరుచుకోని ఈవీఎంల్లో మొత్తం 1,649 ఓట్లు ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. చివరికి టెక్నికల్ సాయంతో ఓపెన్ చేసిన అనంతరం ఓట్లను లెక్కించారు.