మహిళా క్రికెట్‌కు మంచి ఫ్యూచర్ ఉంది..: నీతా అంబానీ
మన దేశంలో మహిళా క్రికెట్‌కు రానున్న రోజులు గొప్పగా ఉండనున్నాయని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఛైర్‌పర్సన్ నీతా అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండియా ఉమెన్స్ క్రికెట్ భవిష్యత్తుపై తాను

Nita Ambani Optimistic : మహిళా క్రికెట్‌కు రానున్న రోజులు గొప్పగా ఉంటాయని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఛైర్‌పర్సన్ నీతా అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండియా ఉమెన్స్ క్రికెట్ భవిష్యత్తుపై తాను ఆశావాద దృక్ఫథంతో చూస్తున్నానని నీతా అంబానీ అన్నారు. యూఏఈలో జరుగుతున్న టీ20 లీగ్‌లో ఫైనల్ చేరిన తన ముంబై జట్టు అధికారిక ట్విటర్ ఖాతాలో సోమవారం నీతా అంబానీ వీడియో పోస్ట్ చేశారు. అందులో మహిళా క్రికెట్‌పై ఆమె మాట్లాడారు. టీమిండియా ఉమెన్స్ జట్టులోని అమ్మాయిలు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అద్భుతంగా రాణిస్తున్నారని స్పష్టం చేశారు.
ప్రపంచ వేదికలపై మన అమ్మాయిలు మెరుస్తున్నారని పేర్కొన్నారు. గత ఆరేళ్లలో వన్డే, టీ20 ప్రపంచకప్ పోటీల్లో మన జట్టు ఆధిపత్యం చెలాయించిందని నీతా అంబానీ పేర్కొన్నారు. అంజుమ్ చోప్రా, జులన్ గోస్వామి, మిథాలీ రాజ్ వంటి లెజెండ్స్ మహిళా క్రికెట్‌కు మార్గదర్శకులుగా నిలిచారని ఆమె వివరించారు. ప్రస్తుతం స్మృతి మంథాన, పూనమ్ యాదవ్, హర్మన్ ప్రీత్ కౌర్ జట్టును ముందుకు తీసుకెళ్తారని నీతా అంబానీ పేర్కొన్నారు.