Cheekatilo Review: రొటీన్ సినిమానే కానీ.. ట్విస్ట్‌తో థ్రిల్ వస్తుంది
శోభిత ధూళిపాళ నటించిన 'చీకటిలో' మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఒక క్రైమ్ పాడ్ కాస్ట్ ప్రజెంటర్ హత్యల మిస్టరీని ఎలా చేధించిందనేది ఈ సినిమా కథ. ఊహించని మలుపులు, చివరి ట్విస్ట్ సినిమాకు ప్లస్ పాయింట్స్. సస్పెన్స్, థ్రిల్లర్ నచ్చే వారికి ఈ చీకటిలో మంచి ఎంపిక అవుతుంది. శోభిత నటన ఆకట్టుకుంటుంది.
నాగచైతన్యతో పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ చేసిన మొదటి సినిమా చీకటిలో.. చాలా రోజుల శోభిత డైరెక్ట్ తెలుగు మూవీ చేయడం.. ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండడంతో… ‘చీకటిలో’ సినిమా పై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఈ క్రమంలోనే జనవరి 23న నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందనేది ఈ పూర్తి రివ్యూలో చూద్దాం… ఇక చీకటి కథ విషయానికి వస్తే.. సంధ్య అలియాస్ శోభిత ధూళిపాళ ఓ టీవీ ఛానల్ లో ఫేమస్ క్రైమ్ న్యూస్ ప్రజెంటర్. TRPని పెంచుకోవడం కోసం తన ఛానల్ వార్తల్ని మార్చే తీరు నచ్చకపోవడంతో ఛానల్ హెడ్ అలియాస్ రవివర్మతో సంధ్య అలియాస్ శోభిత గొడవ పెట్టుకొని జాబ్ మానేస్తుంది. తన ఇంటర్న్ బాబీ అలియాస్ అదితి మ్యాకెల్ సలహాతో, బాయ్ ఫ్రెండ్ అమర్ అలియాస్ విశ్వదేవ్ రాచకొండ సపోర్ట్ తో చీకటిలో అనే టైటిల్ తో ఓ క్రైమ్ పాడ్ కాస్ట్ మొదలుపెద్దుతుంది మన హీరోయిన్. అది మొదలుపెట్టగానే తన ఇంటర్న్ బాబీ, శోభిత బాయ్ ఫ్రెండ్ హత్యకు గురవుతారు. పోలీసాఫీసర్ రాజీవ్ అలియాస్ చైతన్య కృష్ణ ఆ కేసుని డీల్ చేస్తున్నా కూడా.. ఇంకో పక్క మన హీరోయిన్ కూడా.. తన కోణంలో ఆ హత్య గురించి రీసెర్చ్ చేసి పాడ్ కాస్ట్ లో చెబుతుంటుంది. ఈ క్రమంలోనే అది కాస్తా వైరల్ అయి జనాల్లో, పోలీసుల్లో పెద్ద చర్చకు దారి తీస్తుంది. అయితే ఓ ఫైన్ డే.. ఓ ఆగంతకుడు మన హీరోయిన్ సంధ్యకి ఫోన్ చేసి హెచ్చరిస్తాడు. అదే సమయంలో గోదావరి జిల్లాల నుంచి ఓ మహిళ కాల్ చేసి .. ఇలాంటి సంఘటనే ఓ ముప్పై ఏళ్ళ క్రితం జరిగిందని మన హీరోయిన్‌కు చెప్తుంది. దీంతో అదేంటో కనుక్కోవడానికి మన హీరోయిన్ అమర్ తో కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అసలు గోదావరి జిల్లాల్లో 30 ఏళ్ళ క్రితం ఏం జరిగింది? బాబీని ఎవరు హత్య చేసారు? ఎందుకు చేసారు? మళ్ళీ హత్యలు జరిగాయా? సంధ్య, పోలీసులు ఈ మర్డర్ మిస్టరీని ఎలా చేధించారు తెలియాలంటే చీకటిలో చూడాల్సిందే. దాదాపు మర్డర్ మిస్టరీలన్నీ ఒకే ఫార్మాట్లో సాగుతుంటాయి. ఉన్నట్టుండి.. ఓ మర్డర్ జరగడం, ఈ క్రమంలోనే సినిమాలోని మెయిన్ లీడ్.. ఆ మర్డరర్ ఎవరో కనిపెట్టే పనిని మొదలెట్టడం. మధ్యలో పోలీసుల ఎంట్రీలు.. మెయిన్ లీడ్ పడే కష్టాలు.. ఫైనల్‌గా ట్విస్ట్..! ఇలా సినిమా సాగుతుంది. ‘చికటిలో’ సినిమా కూడ ఇంతే. ఓ మర్డర్ మిస్టరీ కథే. అయితే ఆ మర్డర్ మిస్టరీని 30 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటనలకు లింక్ చేస్తూ డైరెక్టర్ శరణ్ కొప్పి శెట్టి రాసుకోవడం బాగుంది. అండ్ ప్రతి సీన్ తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఉత్కంఠను కలిగించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అయితే కొన్ని చోట్ల సీరియస్ నెస్ కోసం సినిమాని కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోయింది. సినిమాకు ఇదే బిగ్గెస్ట్ ప్లస్. ఎవరూ ఊహించని విధంగా క్లైమాక్స్ తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ శరణ్ కొప్పిశెట్టి. సినిమాలో మెయిన్ లీడ్ పాడ్ కాస్ట్ చెప్తుందని.. అది వైరల్ అవుతుందని చూపించారు కానీ.. ఆ షోకు ఏదైనా ప్లాట్ ఫాం సెట్ చేస్తే బాగుండేదని అనిపిస్తుంది.ఇక టైటిల్‌కు తగ్గట్టు సినిమా అంతా డార్క్ టోన్ లో ఉన్నా కూడా… క్లైమాక్స్ లో మాత్రం వెలుగులోకి వచ్చినట్టు కలర్ ప్యాట్రన్‌కి మారుతుంది. ఇక్కడ డైరెక్టర్ థింకింగ్ బాగుందని అనిపిస్తుంది. శోభిత ధూళిపాళ ధైర్యంగా తనకు నచ్చేది చేసే అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించింది. తన పాత్రలో, డైలాగ్స్ లో, నడవడికలో తెలుగుతనం ఉట్టిపడింది. గర్ల్ ఫ్రెండ్ కి సపోర్ట్ చేస్తూనే మధ్యలో గొడవలు పడే బాయ్ ఫ్రెండ్ పాత్రలో విశ్వదేవ్ రాచకొండ కూడా చాలా బాగా నటించాడు. ఇషాచావ్లా కూడా బానే నటించింది. ఇక చైతన్య కృష్ణ పోలీస్ పాత్రలో ఒదిగిపోయాడు. మిగిలిన వాళ్లు కూడా..తమ పరిధి మేర నటించారు. విలన్ గురించి నేను చెప్పను.. అది సస్పెన్స్. సినిమా చూసి మీరు తెలుసుకోవాల్సిందే. శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. సస్పెన్స్ ఎలివేట్ చేయడంతో పాటు.. కొన్ని చోట్ల ఈయన RR భయపెడుతుంది. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. చీకటిలో.. రొటీన్ మర్డర్ మిస్టరీనే.. కానీ ఆకట్టుకుంటుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price: గోల్డ్.. సామాన్యులకు ఇక అందని ద్రాక్షేనా..!
బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు
దుర్గమ్మ ఆలయం నుంచి ఫోన్ కాల్..నమ్మారో..అంతే సంగతులు
బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు
పండుగ కోసం ఊరెళ్లిన కుటుంబం.. తిరిగి వచ్చేసరికి ఇంట్లో..
ఎడారి నేలలో యాపిల్స్, దానిమ్మను పండించిన మహిళా రైతు
ప్రియుడితో కలిసి భర్త మర్డర్.. ఇక తెల్లార్లు అదే పని
విశాఖ సముద్రంలో షాకింగ్ దృశ్యం
మంటల్లో గడ్డివాము.. పడగవిప్పి బుసలు కొట్టిన నాగుపాము
ప్రపంచ అతిపెద్ద గనులు మూసివేత ?? కారణం..

