మధ్యప్రదేశ్ లోనూ కాషాయ రెపరెపలు
మధ్యప్రదేశ్ లో 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో 20 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 7 స్థానాల్లో లీడ్ లో ఉంది. మధ్యాహ్నం వేళ..బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా.. ‘విజేతలైన తమ పార్టీ అభ్యర్థులను’ అభినందిస్తూ ట్వీట్లు చేశారు. విజయం మనదేనని అన్నారు. ఇక యూపీలో 7 సీట్లకు గాను బీజేపీ 4 సీట్లలో ఆధిక్యంలో ఉండగా రెండు చోట్ల వెనుకబడింది. సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ పార్టీ చెరో స్థానంలో లీడ్ లో […]
మధ్యప్రదేశ్ లో 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో 20 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 7 స్థానాల్లో లీడ్ లో ఉంది. మధ్యాహ్నం వేళ..బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా.. ‘విజేతలైన తమ పార్టీ అభ్యర్థులను’ అభినందిస్తూ ట్వీట్లు చేశారు. విజయం మనదేనని అన్నారు.
ఇక యూపీలో 7 సీట్లకు గాను బీజేపీ 4 సీట్లలో ఆధిక్యంలో ఉండగా రెండు చోట్ల వెనుకబడింది. సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ పార్టీ చెరో స్థానంలో లీడ్ లో ఉన్నాయి. కర్నాటక విషయానికి వస్తే.. రెండు సీట్లలో కమలం పార్టీ ఆధిక్యంలో ఉండగా..గుజరాత్ లో అన్ని..8 సీట్ల లోనూ ఈ పార్టీ ముందంజలో ఉంది. పూర్తి స్వీప్ కావడానికి మార్గాన్ని సుగమం చేసుకుంది. 2022 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి ఇది ట్రెయిలర్ అని సీఎం విజయ్ రూపానీ వ్యాఖ్యానించారు. ఛత్తీస్ గఢ్ లో ఒక స్థానానికి జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ లీడ్ లో ఉండగా నాగాలాండ్ లో స్వతంత్ర అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఒడిశాలో రెండు చోట్ల బీజేడీ లీడ్ లో ఉంది.