సాయినాథుడికి రాజకీయ రంగు.. విజయ్ చందర్ ఆగ్రహం
ప్రస్తుతం శిరిడీ సాయిబాబా ఆలయ వివాదం రాజకీయ రంగు పులుముకుంటోంది. తాజాగా ఈ అంశంపై ప్రముఖ నటుడు, ఏపీ ఫిలిం డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ చందర్ స్పందించారు. అసలు ఇప్పటివరకూ శిరీడీ సాయి నాథుడు ఎలా పుట్టారో ఎవరూ కనిపెట్టలేకపోయారన్నారు. కొన్ని వందల ఏళ్ల క్రితం నుంచి శిరిడీ సాయిబాబా ఆలయం కొనసాగుతోందని.. నిన్నగాక మొన్న వచ్చిన ఈ ప్రభుత్వం ఎలా తొలగించగలదని ప్రశ్నించారు. ఇప్పుడు సడన్‌గా సాయి ఆలయాన్ని మార్చాలని వారికి ఎందుకనిపించిందన్నారు. దయచేసి […]

ప్రస్తుతం శిరిడీ సాయిబాబా ఆలయ వివాదం రాజకీయ రంగు పులుముకుంటోంది. తాజాగా ఈ అంశంపై ప్రముఖ నటుడు, ఏపీ ఫిలిం డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ చందర్ స్పందించారు. అసలు ఇప్పటివరకూ శిరీడీ సాయి నాథుడు ఎలా పుట్టారో ఎవరూ కనిపెట్టలేకపోయారన్నారు. కొన్ని వందల ఏళ్ల క్రితం నుంచి శిరిడీ సాయిబాబా ఆలయం కొనసాగుతోందని.. నిన్నగాక మొన్న వచ్చిన ఈ ప్రభుత్వం ఎలా తొలగించగలదని ప్రశ్నించారు. ఇప్పుడు సడన్‌గా సాయి ఆలయాన్ని మార్చాలని వారికి ఎందుకనిపించిందన్నారు. దయచేసి ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దని కోరారు. నిజంగానే ఒక రాత్రిలో శిరిడీ సాయి బాబా.. జన్మించి ఉంటే ఇప్పటివరకూ.. ఆ స్థలానికి ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు విజయ్ చందర్.
కాగా.. సాయిబాబా జన్మస్థలంగా పాథ్రీని అభివృద్ధి చేసేందుకు రూ.100 కోట్ల నిధులను కేటాయిస్తామంటూ గతవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే చేసిన ప్రకటనపై షిర్డీవాసులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జనవరి 19 నుంచి షిర్డీలోని సాయిబాబా ఆలయాన్ని నిరవధికంగా మూసివేస్తామని హెచ్చరించారు. అయితే సంస్థాన్ ట్రస్ట్ మాత్రం ఆలయాన్ని మూసివేయమని.. అంతేకాకుండా భక్తులు దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటామని స్పష్టం చేసింది.
అయితే షిరిడీలోని హోటల్స్, ప్రైవేట్ రవాణా మాత్రం ఆదివారం నుంచి బంద్‌ను పాటించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వివాదంపై ఇవాళ స్థానికులతో చర్చించనున్న ట్రస్ట్ తదుపరి కార్యాచరణ ఏంటన్న దానిపై నిర్ణయం తీసుకోనుంది. అంతేకాకుండా ఈరోజు షిర్డీ బంద్‌కు గ్రామస్తులు పిలుపునిచ్చారు.