బీజేపీ ఎంపీ తేజస్వి హత్యకు కుట్ర.. ఆరుగురి అరెస్ట్

బెంగుళూరు సౌత్ నియోజకవర్గం బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యను గానీ, యువ బ్రిగేడ్ సంస్థాపకుడు చక్రవర్తి సులిబెలెను గానీ హతమార్చడానికి జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఇందుకు పథకం పన్నిన సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) కి చెందిన ఆరుగురు సభ్యులను అరెస్టు చేశారు. తేజస్వి, చక్రవర్తి ఇద్దరూ గత డిసెంబరు 22 న సీఏఏకు అనుకూలంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా వీరు ఈ చట్టానికి నిరసనతెలుపుతున్నవారిని దుయ్యబట్టారు. దీంతో […]

  • Publish Date - 5:18 pm, Sat, 18 January 20 Edited By: Anil kumar poka
బీజేపీ ఎంపీ తేజస్వి హత్యకు కుట్ర.. ఆరుగురి అరెస్ట్

బెంగుళూరు సౌత్ నియోజకవర్గం బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యను గానీ, యువ బ్రిగేడ్ సంస్థాపకుడు చక్రవర్తి సులిబెలెను గానీ హతమార్చడానికి జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఇందుకు పథకం పన్నిన సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) కి చెందిన ఆరుగురు సభ్యులను అరెస్టు చేశారు. తేజస్వి, చక్రవర్తి ఇద్దరూ గత డిసెంబరు 22 న సీఏఏకు అనుకూలంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా వీరు ఈ చట్టానికి నిరసనతెలుపుతున్నవారిని దుయ్యబట్టారు. దీంతో ఆగ్రహించిన ఎస్డీపీఐ సభ్యులైన ఈ ఆరుగురూ.. తేజస్వి, చక్రవర్తిలను హతమార్చేందుకు ప్లాన్ వేశారు. ఇందుకుగాను ఓ వ్యక్తిని కత్తులు, చుర కత్తులతో వారిని చంపడానికి పంపారని, అయితే ఆ వ్యక్తి.. పొరబాటున వరుణ్ భూపాలం అనే కార్యకర్తపై దాడి చేశాడని పోలీసులు తెలిపారు. అయితే మొత్తానికి మహ్మద్ ఇషాన్, సయ్యద్ అక్బర్, సయ్యద్ సిద్ధిక్ అక్బర్, అక్బర్ బాషా, సనావుల్లా పాషా, సాదిక్-ఉల్-అమీన్ అనే ఆరుగురు పోలీసులకు పట్టుబడ్డారు. వీరిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా.. ఈ నెల 20 వరకు పోలీసు కస్టడీకి కోర్టు రిమాండ్ చేసింది.