మీలో మీరే ప్రశ్నించుకోండి: యువతకు డబ్ల్యూహెచ్‌ఓ సూటిప్రశ్న

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ను చాలా దేశాలు ఎత్తేశాయి. దీంతో పలు దేశాల్లో క్లబ్‌లు, పబ్‌లు తెరుచుకోగా.. అందరు బయటికి వస్తున్నారు. కొన్ని దేశాల్లో యువత పార్టీలు చేసుకుంటూ

మీలో మీరే ప్రశ్నించుకోండి: యువతకు డబ్ల్యూహెచ్‌ఓ సూటిప్రశ్న
Follow us

| Edited By:

Updated on: Aug 06, 2020 | 9:24 PM

WHO questions world youth: కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ను చాలా దేశాలు ఎత్తేశాయి. దీంతో పలు దేశాల్లో క్లబ్‌లు, పబ్‌లు తెరుచుకోగా.. అందరు బయటికి వస్తున్నారు. కొన్ని దేశాల్లో యువత పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో యువతకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ ప్రశ్నను సంధించింది.

డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ మైక్ ర్యాన్‌ మాట్లాడుతూ.. కరోనా విషయంలో యువత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ‘నేను కచ్చితంగా పార్టీకి వెళ్లాలా..?’ అని మీలో మీరే ప్రశ్నించుకోండి అని మైక్‌ అన్నారు. అంతేకాదు చాలా మంది యువత తమ కాంటాక్ట్‌ల వివరాలను వెల్లడించడం లేదని ఆయన తెలిపారు. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి అని వైరస్‌ని ఎలాగైనా ఆపాలని వివరించారు. ఇక కరోనాతో యువత చాలా జాగ్రత్తగా ఉండాలని, దీని వలన దీర్ఘకాలిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ ఎపిడోమిలాజిస్ట్‌ మరియా వాన్‌ కెర్కోవ్‌ వెల్లడించారు.

Read This Story Also: తెలంగాణలోని ఆ మూడు జిల్లాల్లో అమాంతం పెరిగిన కరోనా కేసులు