స‌ర్కారు వారి పాట మూవీ.. అప్ డేట్ వచ్చేసింది…

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ కు పెద్ద పండగ మరో మూడు రోజుల్లో రాబోతోంది. అదే ప్రిన్స్ మహేష్ పుట్టిన రోజు ఆగస్టు 9 ఈ రోజు సూపర్ స్టార్ అభిమానలుు పెద్ద ఎత్తున సంబరాలు...

  • Sanjay Kasula
  • Publish Date - 9:12 pm, Thu, 6 August 20
స‌ర్కారు వారి పాట మూవీ.. అప్ డేట్ వచ్చేసింది...

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ కు పెద్ద పండగ మరో మూడు రోజుల్లో రాబోతోంది. అదే ప్రిన్స్ మహేష్ పుట్టిన రోజు ఆగస్టు 9 ఈ రోజు సూపర్ స్టార్ అభిమానలుు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటారు. అయితే కరోనా కారణంగా సెలబ్రేషన్స్ ను ఆన్ లైన్ లో మొదలు పెట్టారు.

మ‌హేశ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఫ్యాన్స్ కు స‌ర్కారు వారి పాట మూవీ టీం నుంచి వాయిస్ మెసేజ్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దీనిపై మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ ఓ గుడ్ న్యూస్ ను చెప్పారు. మ‌హేశ్ బాబు ఓ మైక్ ముందున్న స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ.. మ‌రో 3 రోజుల్లో.. రెడీగా ఉన్నారా..!! అంటూ ట్వీట్ చేశారు.

మ‌హేశ్ బాబు అభిమానుల‌కు డైరెక్ట‌ర్ ప‌ర‌శురాం బెస్ట్ స‌ర్ ప్రైజింగ్ గిఫ్ట్ ను ఇవ్వ‌నున్నార‌ని  తెలుస్తోంది. 14 రీల్స్ ఎంట‌ర్ టైన్ మెంట్స్, మైత్రీ మూవీ మేక‌ర్స్ టీం సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి.