మైక్ టైసన్ ప్రాక్టీస్ చూశారా…

ప్రత్యర్థి అయినా టైసన్‌ పంచ్‌లకు మట్టికరవాల్సిందే. రెండు దశాబ్ధాల పాటు తన ఆటతీరుతో ఉర్రూతలూగించిన మాజీ ప్ర‌పంచ హెవీవెయిట్ బాక్సింగ్‌ ఛాంపియ‌న్ మైక్ టైస‌న్ మ‌ళ్లీ త‌న పంచ్ ప‌వ‌ర్ చూపించ‌బోతు..

మైక్ టైసన్ ప్రాక్టీస్ చూశారా...
Follow us

|

Updated on: Aug 06, 2020 | 9:44 PM

ప్రపంచ అరవీర భయంకరుడు.. బాక్సింగ్ ఆటగాళ్ల పాలిట సింహ స్వప్నం.. అతడే మైక్‌ టైసన్‌. అతని బరిలోకి దిగాడంటే ఎంతటి ప్రత్యర్థి అయినా టైసన్‌ పంచ్‌లకు మట్టికరవాల్సిందే. రెండు దశాబ్ధాల పాటు తన ఆటతీరుతో ఉర్రూతలూగించిన మాజీ ప్ర‌పంచ హెవీవెయిట్ బాక్సింగ్‌ ఛాంపియ‌న్ మైక్ టైస‌న్ మ‌ళ్లీ త‌న పంచ్ ప‌వ‌ర్ చూపించ‌బోతున్నాడు. తన ఫ్యాన్స్ ను పిచ్చెక్కించ బోతున్నాడు.

పదిహేనేళ్ల సుదీర్ఘ విరామం తరువాత బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ మళ్లీ రింగ్‌లోకి దిగనున్నాడు. సెప్టెంబరు 12న జరగనున్న ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో టైసన్ పాల్గొన్ననున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మాజీ బాక్సర్ రాయ్ జోన్స్ జూనియర్‌తో టైసన్ తలపడనున్నాడు. ఈ బౌట్ కోసం అతడు తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

అయితే 54 ఏళ్ల వయసులో వ్యాయామం చేస్తుండడంతో శరీరం సహకరించడం లేదని, దీంతో  ‘ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన్‌’ పరికరం సాయంతో కండరాల వ్యాయామం చేస్తున్నానని టైసన్ చెప్పుకొచ్చాడు. ‘చాలా కాలం తరువాత బాక్సింగ్‌ రింగ్‌లోకి అడుగుపెట్టబోతున్నాను. దానికోసం మొదట వ్యాయామం ప్రారంభించాను. అయితే కీళ్లు సహకరించడం లేదు. ఇందుకే బాక్సింగ్‌కు దూరమయ్యాను అని అప్పుడనిపించింది. దాంతో కొత్తగా ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన్ పరికరంతో శరీర దారుఢ్యం పెంచుకుంటున్నాన’ని టైసన్ వెల్లడించాడు.