దేశ రాజధానిలో పెరిగిన కరోనా కేసులు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా కేసులు అదుపులోకి వస్తుండగా.. గడిచిన 24 గంటల్లో మళ్లీ కేసుల సంఖ్య పెరిగింది. తాజాగా కొత్తగా మరో1299 కరోనా పాజిటివ్ కేసులు..
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా కేసులు అదుపులోకి వస్తుండగా.. గడిచిన 24 గంటల్లో మళ్లీ కేసుల సంఖ్య పెరిగింది. తాజాగా కొత్తగా మరో1299 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు ఢిల్లీ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,41,531కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని 1,27,124 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వీటిలో గడిచిన 24 గంటల్లో 1,008 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా 10,348 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఢిల్లీ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి రాష్ట్ర వ్యాప్తంగా 4,059 మంది మరణించారు.
కాగా, గురువారం నాడు ఢిల్లీ వ్యాప్తంగా దాదాపు ఇరవై వేల కరోనా టెస్టులు జరిపారు. వీటిలో 5,737 ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయగా.. 14,699 ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేపట్టారు. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది.
5,737 RTPCR/CBNAAT/TrueNat tests and 14,699 Rapid antigen tests conducted today. A total of 11,20,318 test conducted so far: Government of Delhi https://t.co/dOurQWHK81
— ANI (@ANI) August 6, 2020