విద్యార్థుల చదువుల కోసం మరో రెండు ఛానల్స్..
కరోనా మహమ్మారి ప్రభావంతో విద్యార్థుల చదువులు ఇప్పుడు ఇంటి నుంచే సాగుతున్నాయి. వాటిలో మార్పులు తీసుకొచ్చేందుకు.. మరింత సులభతరం చేయటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఇదే అంశంపై తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. ఆన్‌లైన్, దూరదర్శన్ ద్వారా విద్యార్థులకు పాఠాలు నేర్పించనున్నట్లు వెల్లడించారు. విద్యాసంవత్సరం పాలసీపై సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారని అన్నారు. విద్యాబోధన కోసం ఒకట్రెండు ఛానల్స్‌ను హైర్ చేసుకోవాలి అనే యోచిస్తున్నట్లు […]
కరోనా మహమ్మారి ప్రభావంతో విద్యార్థుల చదువులు ఇప్పుడు ఇంటి నుంచే సాగుతున్నాయి. వాటిలో మార్పులు తీసుకొచ్చేందుకు.. మరింత సులభతరం చేయటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఇదే అంశంపై తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించారు.
ఆన్‌లైన్, దూరదర్శన్ ద్వారా విద్యార్థులకు పాఠాలు నేర్పించనున్నట్లు వెల్లడించారు. విద్యాసంవత్సరం పాలసీపై సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారని అన్నారు. విద్యాబోధన కోసం ఒకట్రెండు ఛానల్స్‌ను హైర్ చేసుకోవాలి అనే యోచిస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలావుంటే.. ఎంట్రెన్స్, పరీక్షలపై హైకోర్టులో పిల్ ఉందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.