పవన్‌తో సినిమా నేను చేయలేను.. జక్కన్న సెన్సేషనల్ కామెంట్స్

ఇప్పటికే ఎన్టీఆర్‌, ప్రభాస్‌ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు రాజమౌళి. ఇప్పుడు తాజాగా మరో బాంబు పేల్చారు. మెగాస్టార్ చిరంజీవి బ్రదర్.. పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌తో సినిమా చేసే విషయంపై..

  • Tv9 Telugu
  • Publish Date - 4:49 pm, Mon, 20 April 20
పవన్‌తో సినిమా నేను చేయలేను.. జక్కన్న సెన్సేషనల్ కామెంట్స్

టాలీవుడ్‌ తనకంటూ ఓ స్టార్‌డమ్ క్రియేట్ చేసుకున్నారు డైరెక్టర్ రాజమౌళి. అంతేకాకుండా ప్రపంచానికి కూడా తెలుగు సినిమా పవర్ ఏంటో చూపించారు. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న రాజమౌళి ప్రస్తుతం మరో భారీ చిత్రం ‘ఆర్ఆర్ఆర్‌’ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవల్‌లో రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టైటిల్ ‘రౌద్రం రణం రుధిరం’ అని కూడా రివీల్ చేశారు. కాగా లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటోన్న జక్కన్న పలు ఛానెల్స్‌కి ఇంటర్య్వూలు ఇస్తూ, మీడియతో ఇంట్రాక్టీవ్ అవుతున్నారు. ఇందులో భాగంగా పవన్‌ కళ్యాణ్‌తో తనకు కుదరదని మరోసారి తన మనసులోని మాటను బయటపెట్టేశారు.

ఇప్పటికే ఎన్టీఆర్‌, ప్రభాస్‌ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు రాజమౌళి. ఇప్పుడు తాజాగా మరో బాంబు పేల్చారు. మెగాస్టార్ చిరంజీవి బ్రదర్.. పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌తో సినిమా చేసే విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గతంలో పవన్, నేను సినిమా చేసే ప్రయత్నం చేశాం. కానీ అది అప్పట్లో కుదరలేదు. ఆ తరువాత ఎవరి ప్రాజెక్ట్స్‌తో వారు బిజీ కావడంతో ఆ సినిమా వాయిదా పడుతూ’ వచ్చిందని రాజమౌళి ఆయన పేర్కొన్నారు.

అలాగే పవన్ ఆలోచనా విధానమే వేరని, ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి సినిమాకు ఎక్కువ సమయం కేటాయించలేరు. కానీ నేను సినిమా చేయడానికి ఎక్కువ టైం కేటాయిస్తాను. అందుకే పవన్‌కు, నాకూ కుదరదని తేల్చి చెప్పేశారు డైరెక్టర్ రాజమౌళి. ఇప్పుడు ఈ కామెంట్స్ బట్టి చూస్తుంటే.. భవిష్యత్తులో కళ్యాణ్, జక్కన్న కాంబినేషన్‌లో సినిమా వచ్చే ఛాన్స్ లేనట్లే కనిపిస్తోంది.

Read More: 

తాతయ్యకు దేవాన్ష్ జన్మదిన శుభాకాంక్షలు.. ఎలా చెప్పాడంటే..

నా ఫస్ట్ సినిమాకు.. ఇలాంటి హీరో దొరికాడేంటని చాలా ఫీల్ అయ్యా..

ఇంటర్‌ సెకండ్ ఇయర్ రిజల్ట్స్‌.. టీఎస్ బోర్డు కీలక నిర్ణయం