Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 22 వేల 771 మంది వైరస్​ సోకింది. మరో 442 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,48,315. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు 2,35,433. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 3,94,227. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 18,655.
  • తిరుమల: నేడు ఉదయం 11గంటలకు టిటిడి బోర్డ్ అత్యవసర సమావేశం. తిరుమల కొండపై పదిమంది టిటిడి ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఏమి చేయలనేదానిపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన టిటిడి. కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్న టిటిడి.
  • దేశంలో పెరుగుతున్న కోవిడ్-19 రికవరీ రేటు. 60.8శాతానికి చేరుకున్న కోలుకున్నవారి సంఖ్య. కోలుకున్నవారు 95.48శాతం, మృతుల శాతం 4.52.
  • కృష్ణా జిల్లా : కొల్లు రవీంద్రను వీడియో కాన్పిరెన్స్ ద్వారా మెజిస్ట్రేట్ ముందు‌ హాజరుపరిచిన పోలీసులు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో ఇంటి నుంచే న్యాయమూర్తి కేసు విచారణ. కొనసాగుతున్న విచారణ. వీడియో కాన్పిరెన్స్ లో విచారణ అనంతరం న్యాయమూర్తి కొల్లు రవీంద్రకు రిమాండ్ విధించే అవకాశం.
  • నిర్మాత పోకూరి రామారావు ఈరోజు ఉదయం కరోన కారణంగా మృతి చెందారు. పోకూరి రామారావు పోకూరి బాబురావు సోదరుడు. ఈతరం ఫిలిమ్స్ లో ఎన్నో చిత్రాలు తీశారు.
  • ఇంజనీరింగ్ విద్యార్థిని అశ్లీల చిత్రాలు ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేసిన విద్యార్థిని గుర్తించిన పోలీసులు. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఆ యువకుడికి వీడియోలు ఎలా వచ్చాయన్న కోణంలో విచారణ. ఆ యువకుడు మరికొంతమందికి వీడియోస్ షేర్ చేసినట్లు గుర్తించిన పోలీసులు. కేసులో కొనసాగుతున్న విచారణ
  • తెలంగాణ లో రికార్డు స్థాయిలో కేసులు. రాష్ట్రంలో 20 వేలు, హైదరాబాద్ లో 16 వేలు దాటిన పాజిటివ్ కేసులు. లక్ష దాటిన కరోనా టెస్టింగ్ లు. రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే 1892 కరోనా పాజిటివ్ కేసులు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కేసులు- 20,462. జిహెచ్ఎంసి పరిధిలో ఒక్క రోజు 1658 కేసులు. Ghmc లో 16, 219కు చేరుకున్న కేసులు. 283 కి చేరుకున్న కరోనా మరణాలు. చికిత్స పొందుతున్న వారు- 9984. డిశ్చార్జి అయిన వారు -10195.
  • జీవీకే కుంభకోణంపై ఈడీ ఆరా. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను తమకివ్వాలని ఈడీ లేఖ. జీవీకే స్కాంపై ప్రాథమిక సాక్ష్యాలు సేకరిస్తున్న ఈడీ.

నా ఫస్ట్ సినిమాకు.. ఇలాంటి హీరో దొరికాడేంటని చాలా ఫీల్ అయ్యా..

నా ఫస్ట్ సినిమాకు పెద్ద పెద్ద హీరోలతో చేయాలనుకున్నా.. కానీ ఇలాంటి హీరో దొరికాడేంటని అనుకున్నానని డైరెక్టర్ రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నిజానికి తారక్‌, రాజమౌళిలు ఎంతో ఫెండ్లీగా ఉంటారు. దాదాపు మూడు సినిమాలు వీరిద్దరూ..
What SS Rajamouli felt when he choose Junior NTR as his first movie Hero, నా ఫస్ట్ సినిమాకు.. ఇలాంటి హీరో దొరికాడేంటని చాలా ఫీల్ అయ్యా..

నా ఫస్ట్ సినిమాకు పెద్ద పెద్ద హీరోలతో చేయాలనుకున్నా.. కానీ ఇలాంటి హీరో దొరికాడేంటని అనుకున్నానని డైరెక్టర్ రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నిజానికి తారక్‌, రాజమౌళిలు ఎంతో ఫెండ్లీగా ఉంటారు. దాదాపు మూడు సినిమాలు వీరిద్దరూ కలిసి పని చేశారు. ఇప్పుడు మళ్లీ ఆర్ఆర్‌ఆర్‌లో కలిసి వర్క్ చేస్తున్నారు. తాజాగా టీవీ-9కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌ గురించి చెప్పుకొచ్చారు ఆయన.

తారక్‌తో మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్-1 ఫిల్మ్ చేసేటప్పుడు.. అప్పుడు అతనికి 19 సంవత్సరాలు ఉండేవి. సరిగ్గా మీసాలు కూడా లేవు. అంతేకాకుండా.. చాలా లావుగా ఉండేవాడు. హెయిర్ స్టైలింగ్, పర్సనల్ మెయిన్‌టైనింగ్ కూడా లేదు. నాకేంటి మొదటి సినిమాకి ఇలాంటి హీరో దొరికాడని ఫీల్ అయ్యాను. కానీ నాది మొదటి సినిమానే కావడంతో.. నేను వర్క్ స్టార్ట్ చేశాను. సడన్‌గా మధ్యలో ఇంటెర్వెల్ సీన్స్‌లో ఎన్టీఆర్ డైలాగ్స్ చెబుతున్నప్పుడు అనుకున్నా.. ఇతను పెద్ద సూపర్ స్టార్ అవుతాడని. అతని లోపల ఏదో సమ్‌థింగ్ స్పెషల్ ఉందనుకున్నా. తన లుక్స్‌ని దాటి జనాల్ని డైలాగ్స్‌తో విపరీతంగా అట్రాక్ట్ చేసే టాలెంట్ ఇతనిలో ఉంది. నేను ఇప్పటివరకూ ఒక తప్పు కన్నుతో చూశానని నాకు అనిపించింది. ఈ విషయాన్ని నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని తెలిపారు రాజమౌళి.

Read More: 

యాంటీబాడీస్‌పై డబ్ల్యూహెచ్‌వో షాకింగ్ ప్రకటన.. ఆ ఆశలపై నీళ్లు..

Related Tags