AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mrunal Thakur: పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్.. అంతమాట అనేసిందేంటి.!

హనురాఘవాపుడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సీతామహాలక్ష్మీ పాత్రలో అద్భుతంగా నటించింది. ఆ తర్వాత ఈ చిన్నదానికి క్రేజీ ఆఫర్స్ క్యూ కట్టాయి. సీతారామం సినిమా తర్వాత నేచురల్ స్టార్ నానితో జతకట్టింది.

Mrunal Thakur: పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్.. అంతమాట అనేసిందేంటి.!
Mrunal Thakur
Rajeev Rayala
|

Updated on: Apr 25, 2024 | 9:44 PM

Share

సీతారామం సినిమాతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయింది మృణాల్ ఠాకూర్. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. హనురాఘవాపుడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సీతామహాలక్ష్మీ పాత్రలో అద్భుతంగా నటించింది. ఆ తర్వాత ఈ చిన్నదానికి క్రేజీ ఆఫర్స్ క్యూ కట్టాయి. సీతారామం సినిమా తర్వాత నేచురల్ స్టార్ నానితో జతకట్టింది. నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాలో హీరోయిన్ గా చేసింది. హాయ్ నాన్న సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో మృణాల్ ఠాకూర్ గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. దాంతో ఈ బ్యూటీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

ఈ రెండు సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది మృణాల్. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ మృణాల్ పై ఎలాంటి ప్రభావం పడలేదు. తెలుగులో ఈ అమ్మడికి మరిన్ని బిగ్ ఆఫర్స్ వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మృణాల్ ఠాకూర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

పిల్లలు కనడం  పై మృణాల్ షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా మృణాల్ మాట్లాడుతూ..  కెరీర్, లైఫ్ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ముఖ్యం అని తెలిపింది. కానీ ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలో తెలుసుకోవాలి. రిలేషన్స్ షిప్స్  మెయింటేన్ చెయ్యడం చాలా కష్టం అన్న విషయం నాకు తెలుసు. మనల్ని అర్ధం చేసుకునే పార్ట్నర్ రావడం అవసరం. అలాగే నేను ఎగ్ ఫ్రీజింగ్ గురించి కూడా ఆలోచిస్తున్నాను అని తెలిపింది. ప్రస్తుతానికి కెరీర్ పైనే నా దృష్టి . ఒక దశ స్టేజ్ తర్వాత తమ నిల్వ చేసిన అండాలతో పిల్లలను కనడం ఇప్పుడు కామన్ అయ్యిపోయింది అని తెలిపింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా.. కానీ బిడ్డను కనే ఆలోచన లేదని తెలిపింది.

మృణాల్ ఠాకూర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.