ప్రపంచవ్యాప్తంగా కరోనా పంజా.. లక్షా 50 వేల మందికి పైగా మృతి

ప్రపంచ దేశాల్లో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. కొన్ని దేశాల్లో హెచ్చు తగ్గులు మినహా మరణాలు, కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. అన్ని దేశాల్లోనూ కలిపి కొవిడ్ 19 వైరస్ భారిన పడి మరణించిన వారి సంఖ్య లక్షా 54 వేల 145కు చేరుకుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు..

ప్రపంచవ్యాప్తంగా కరోనా పంజా.. లక్షా 50 వేల మందికి పైగా మృతి
Follow us

| Edited By:

Updated on: Apr 18, 2020 | 9:41 AM

ప్రపంచ దేశాల్లో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. కొన్ని దేశాల్లో హెచ్చు తగ్గులు మినహా మరణాలు, కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. అన్ని దేశాల్లోనూ కలిపి కొవిడ్ 19 వైరస్ భారిన పడి మరణించిన వారి సంఖ్య లక్షా 54 వేల 145కు చేరుకుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు 22 లక్షల 48 వేల 891 మంది వైరస్ బారిన పడ్డారు. కాగా అన్ని దేశాల్లోనూ మృత్యు ఘంటికలు కొనసాగుతున్నాయి. కొవిడ్ 19 వైరస్ తీవ్రత నాటినికీ పెరుగుతోంది తప్ప ఏమాత్రం తగ్గుముఖం పట్టినట్లు కనిపించడంలేదు. కొత్త కేసులు మరణాలు అన్ని దేశాల్లో మరింతగా పెరగడం కలవరపరుస్తోంది.

ఇక అగ్రరాజ్యం అమెరికాలో ఒక్క రోజులో 2,535 మంది మరణించగా.. కొత్తగా 32,165 మందికి వైరస్ సోకింది. కాగా మొత్తంగా ఇప్పటివరకూ అమెరికాలో 7 లక్షల 9వేల 735 మంది వైరస్ బారిన పడగా.. 37,154 మంది మరణించారు. కాగా మే 15 వరకూ ఇక్కడ లాక్‌డౌన్ కొనసాగనుంది. ఫ్రాన్స్‌లో ఒకే రోజు 761 మంది మృతి చెందగా.. కొత్తగా 1,909 కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 47 వేల 960 దాటింది. మృతుల సంఖ్య 18,681కి చేరింది.

స్పెయిన్‌లో కరోనా ధాటికి ఒక్క రోజే 687 మంది మరణించగా కొత్తగా 5,891 కేసులు నమోదయ్యాయి. మొత్తం ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,90,839గా నమోదైంది. ఇటలీలో ఒకరోజు వ్యవధిలో 575 మంది ప్రాణాలు కోలప్పోయారు. కాగా ఇప్పటివరూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 22,745కి చేరుకుంది. కొత్తగా 3,493 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 72 వేల 434 దాటింది.

ఇక ఇరాన్‌లో కరోనాతో గురువారం 89 మంది మరణించారు. మొత్తంగా 4,950 మంది చనిపోయారు. అలాగే టర్కీలో ఒక్క రోజులోనే 4,350 పైగా కరోనా కేసులు నమోదు కాగా.. మొత్తంగా 1,769 మంది చనిపోయారు. గురువారం 126 మంది మరణించారు. అలాగే ఆఫ్రికాలో ఇప్పటివరకూ వెయ్యిమంది మృతి చెందారు.

బెల్జియంలో గత 24 గంటల్లో 306 మంది ప్రాణాలు కోల్పోగా.. కొత్తగా 1,329 కేసులు నమోదయ్యాయి. అలాగే మొత్తంగా 36 వేలకు పైగా దాటింది. అలాగే 5,163 మంది మృతి చెందారు. నెదర్లాండ్స్‌లో ఒకే రోజులో 144 మంది వైరస్‌కు బలయ్యారు. మృతుల సంఖ్య 3,450గా నమోదైంది. స్విట్జర్లాండ్‌లో మరో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,310కి చేరింది. ఇక పోర్చుగల్‌లో 28 మంది, రష్యాలో 41 మంది, కెనడాలో 115 మంది చనిపోయారు. అలాగే భారత్‌లో ఇప్పటివరకూ మొత్తంగా 14,378 కరోనా కేసులు నమోదవ్వగా.. 480 మంది మరణించారు.

Read More: 

యాంటీబాడీస్‌పై డబ్ల్యూహెచ్‌వో షాకింగ్ ప్రకటన.. ఆ ఆశలపై నీళ్లు..