బ్రేకింగ్.. విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో చుక్కెదురు

తనను భారత్ కు అప్పగించకుండా చూడాలంటూ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా దాఖలు చేసిన అప్పీలును లండన్ కోర్టు కొట్టివేసింది. ఇండియాలో సుమారు 17 బ్యాంకులకు దాదాపు 9వేల కోట్ల కుచ్ఛు టోపీ పెట్టి బ్రిటన్ చెక్కేసిన విజయ్ మాల్యా ను అప్పగించాలంటూభారత ప్రభుత్వం పలుమాలు బ్రిటన్ ను కోరిన సంగతి తెలిసిందే. ఇండియాలోని ఆయన ఆస్తులను సీబీఐ సీజ్ చేసింది. తనను అప్పగించాలన్న భారత అభ్యర్థనను సవాలు చేస్తూ మాల్యా గత ఫిబ్రవరిలో హైకోర్టుకెక్కారు. ప్రస్తుతం […]

బ్రేకింగ్.. విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో చుక్కెదురు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 20, 2020 | 5:00 PM

తనను భారత్ కు అప్పగించకుండా చూడాలంటూ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా దాఖలు చేసిన అప్పీలును లండన్ కోర్టు కొట్టివేసింది. ఇండియాలో సుమారు 17 బ్యాంకులకు దాదాపు 9వేల కోట్ల కుచ్ఛు టోపీ పెట్టి బ్రిటన్ చెక్కేసిన విజయ్ మాల్యా ను అప్పగించాలంటూభారత ప్రభుత్వం పలుమాలు బ్రిటన్ ను కోరిన సంగతి తెలిసిందే. ఇండియాలోని ఆయన ఆస్తులను సీబీఐ సీజ్ చేసింది.

తనను అప్పగించాలన్న భారత అభ్యర్థనను సవాలు చేస్తూ మాల్యా గత ఫిబ్రవరిలో హైకోర్టుకెక్కారు. ప్రస్తుతం ఈ కేసుపై బ్రిటన్ హోం మంత్రి ప్రీతి పటేల్ తుది నిర్ణయం తీసుకోవలసి ఉంది. మాల్యా దాఖలు చేసిన అప్పీలును జస్టిస్ స్టీఫెన్ ఇర్విన్, జస్టిస్ ఎలిజబెత్ లైంగ్ లతో కూడిన బెంచ్ విచారిస్తూ.. తీర్పును రహస్యంగా లిఖితపూర్వకంగా ఇచ్చింది. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ అమల్లో ఉన్న కారణంగా కోర్టు ఈ చర్య చేపట్టింది. ఇండియాలోని సీబీఐ, ఈడీ ఈయనపై చేసిన ఆభియోగాల్లో ఏడు ముఖ్యమైన అంశాలకు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయని తాము భావిస్తున్నట్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు. కాగా.. ఈ తీర్పును సవాలు చేస్తూ మాల్యా.. 14 రోజుల్లోగా సుప్రీంకోర్టుకెక్కవచ్చు.