AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌ లాక్‌డౌన్ ఇక మరింత టైట్.. సీపీ కొత్త ఆంక్షలు

తెలంగాణలో అత్యంత పాండెమిక్ సిచ్యుయేషన్ వున్న సిటీ హైదరాబాద్ నగరం. 196 కరోనా కంటైన్మెంట్ జోన్లు జీహెచ్ఎంసీ పరిధిలో వుండగా.. వాటిలో వుంటున్న జనం లాక్ డౌన్ ఆంక్షలను, కంటైన్మెంట్ షరతులను ఏ మాత్రం పాటించకుండా జనాన్ని పరేషాన్ చేస్తున్నారు. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు ఆంక్షలను మార్చేశారు సిటీ పోలీసులు.

హైదరాబాద్‌ లాక్‌డౌన్ ఇక మరింత టైట్.. సీపీ కొత్త ఆంక్షలు
Rajesh Sharma
|

Updated on: Apr 20, 2020 | 3:25 PM

Share

తెలంగాణలో అత్యంత పాండెమిక్ సిచ్యుయేషన్ వున్న సిటీ హైదరాబాద్ నగరం. 196 కరోనా కంటైన్మెంట్ జోన్లు జీహెచ్ఎంసీ పరిధిలో వుండగా.. వాటిలో వుంటున్న జనం లాక్ డౌన్ ఆంక్షలను, కంటైన్మెంట్ షరతులను ఏ మాత్రం పాటించకుండా జనాన్ని పరేషాన్ చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర కేబినెట్ మరింత కట్టుదిట్టంగా లాక్ డౌన్ అమలు చేయాలని, ఎలాంటి సడలింపులు ఇవ్వవద్దని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్లలో బందోబస్తును పెంచుతోంది పోలీసు శాఖ.

ఈక్రమంలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సోమవారం (ఏప్రిల్20వ తేదీ) నుంచి అమలు చేయబోతున్న కొత్త ఆంక్షలను మీడియాకు వెల్లడించారు. ‘‘రాష్ట్రంలో ప్రస్తుతం కరోనాపై వార్ జరుగుతుంది.. మే 7వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది అని కేబినెట్ నిర్ణయించింది.. లాక్ డౌన్ అమలుపై పోలీస్ ఉన్నతాధికారులు చర్చించాము. మరింత స్ట్రిక్ట్ గా అమలు చేయాలని నిర్ణయించాము.. ఆన్‌లైన్ ఫుడ్ ఐటమ్స్ సప్లై చేసే సంస్థలపై ఆంక్షలు ఉన్నాయి.. అతిక్రమించి రోడ్డు మీదకు కేసులు బుక్ చేసి వాహనాలు సీజ్ చేస్తాం.. ’’ అని అంజనీకుమార్ తెలిపారు.

ప్రస్తుతం నగరంలో 12 వేల మంది పోలీసులు లాక్ డౌన్ డ్యూటీ లో ఉన్నారని ఆయన వివరించారు. సున్నితమైన ప్రాంతాల్లో డ్యూటీ చేసే వారికి పీపీఈ కిట్స్ ఇచ్చామని తెలిపారు. పాసులు పొందటం కోసం ఐటీ సెల్ తరపున నుండి ఓ పోర్టల్ ప్రారబించామని, వాటి కోసం ఎవరు కమిషనర్ ఆఫీసుకు రావొద్దని ఆయన ప్రజలకు సూచించారు. కలర్ మాత్రమే కాదు బ్లాక్ అండ్ వైట్ పాస్ కూడా అనుమతించబడతాయన్నారు. కొన్ని ఏరియాల్లో లాక్ డౌన్ ఉల్లంఘనలను గుర్తించామని, నేటి నుండి (ఏప్రిల్ 20 నుంచి) మరింత స్టిక్ట్‌గా లాక్ డౌన్ అమలు చేస్తామని అంజనీకుమార్ ప్రకటించారు.

‘‘ అన్ని మతాల వారు పండుగలను ఇళ్లలోనే జరుపుకోవాలి.. లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలో హాస్పిటల్‌లో పరీక్షలు చేయించుకోవాలి.. ఇప్పటివరకు 49వేల 863 వాహనాలపై కేసులు బుక్ చేసాము.. 69 వేల 288 వాహనాలు సీజ్ చేసాము.. సోమవారం నుంచి లా అండ్ ఆర్డర్ మరింత కఠినంగా అమలు చేస్తాము.. పాసులను మిస్ యూజ్ చేస్తే తక్షణం పాసులను కాన్సిల్ చేసి వాహనాలు సీజ్ చేస్తాము..’’ అని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వార్నింగ్ ఇచ్చారు.