AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధోని రనౌట్‌తో అభిమాని మృతి..

భారత్-కివీస్ మధ్య జరిగిన సెమీస్ ఫైనల్ కోల్‌కతాలో విషాదం నింపింది. ధోనీ రనౌట్ కావడంతో తట్టుకోలేకపోయిన శ్రీకాంత్ అనే వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. ప్రపంచకప్‌ లీగ్ దశలో టాప్‌ ప్లేస్‌లో నిలిచిన టీమిండియా సెమీస్‌లో కివీస్ చేతిలో ఓడిపోవడాన్ని భారత అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినా రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ భారీ భాగస్వామ్యంతో జట్టులో ఆశలు రేపారు. అయితే జడేజా నిష్కమించినా ధోనీ ఉండటంతో భారత అభిమానుల్లో మళ్లీ ఆశ చిగురించింది. […]

ధోని రనౌట్‌తో అభిమాని మృతి..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 11, 2019 | 4:07 PM

Share

భారత్-కివీస్ మధ్య జరిగిన సెమీస్ ఫైనల్ కోల్‌కతాలో విషాదం నింపింది. ధోనీ రనౌట్ కావడంతో తట్టుకోలేకపోయిన శ్రీకాంత్ అనే వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. ప్రపంచకప్‌ లీగ్ దశలో టాప్‌ ప్లేస్‌లో నిలిచిన టీమిండియా సెమీస్‌లో కివీస్ చేతిలో ఓడిపోవడాన్ని భారత అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినా రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ భారీ భాగస్వామ్యంతో జట్టులో ఆశలు రేపారు. అయితే జడేజా నిష్కమించినా ధోనీ ఉండటంతో భారత అభిమానుల్లో మళ్లీ ఆశ చిగురించింది. రెండు ఓవర్లలో 31 పరుగులు చేయాల్సిన దశలో 49వ ఓవర్ తొలి బంతికే ధోనీ సిక్స్ కొట్టడంతో అభిమానులు మురిసిపోయారు.

అదే ఓవర్ మూడో బంతికి రెండో పరుగు తీసేందుకు ప్రయత్నించి ధోనీ రనౌట్ కావడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అప్పటివరకు మిణుకుమిణుకుమంటూ ఉన్న ఆశలు అతడి నిష్క్రమణతో మూసుకుపోయాయి. కోల్‌కతాకు చెందిన శ్రీకాంత్ ధోనికి వీరాభిమాని. అప్పటి వరకూ మొబైల్ ఫోన్‌లో మ్యాచ్ చూస్తున్న శ్రీకాంత్ ధోని రనౌట్ కావడంతో తట్టుకోలేక ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతడిని గమనించిన స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
ఈ లయ 'శృతి' తప్పింది.. ఇంకాస్త అతి చేసి...
ఈ లయ 'శృతి' తప్పింది.. ఇంకాస్త అతి చేసి...
ఇండియా వర్సెస్ కివీస్.. జనవరి 11 నుంచి టీవీలకు అతుక్కుపోండి
ఇండియా వర్సెస్ కివీస్.. జనవరి 11 నుంచి టీవీలకు అతుక్కుపోండి
రాజకీయాల్లోకి దిగిన హీరోయిన్..
రాజకీయాల్లోకి దిగిన హీరోయిన్..
పోలీసులను చూసి స్పీడ్ పెంచిన అంబులెన్స్ డ్రైవర్.. ఆపి తనిఖీ చేయగా
పోలీసులను చూసి స్పీడ్ పెంచిన అంబులెన్స్ డ్రైవర్.. ఆపి తనిఖీ చేయగా
మీ ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందా..? ఇలా చేస్తే చాలు..
మీ ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందా..? ఇలా చేస్తే చాలు..
అరటిపండు ఏ టైమ్‌లో తినాలి.. ఎప్పుడు పడితే అప్పుడు తింటే..
అరటిపండు ఏ టైమ్‌లో తినాలి.. ఎప్పుడు పడితే అప్పుడు తింటే..
చూపుడు వేలు ఆకారం.. మీ వ్యక్తిత్వం తెలుపుతుందా.? పండితుల మాటేంటి?
చూపుడు వేలు ఆకారం.. మీ వ్యక్తిత్వం తెలుపుతుందా.? పండితుల మాటేంటి?