మైనర్ రేపిస్టులకూ మరణశిక్ష.. ‘ పోక్సో ‘ చట్టానికి సవరణ

దేశంలో చిన్నారులు, పిల్లలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు పెరిగిపోతుండడంతో దీనికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం నడుం బిగించింది. ఇందులో భాగంగా ‘ పోక్సో ‘ చట్టానికి సవరణలను ఆమోదించింది. మైనర్లయినప్పటికీ వారికీ మరణ శిక్ష విధించాలని, అలాగే కల్లా కపటం తెలియని పిల్లలపట్ల వారు ఇతర నేరాలకు పాల్పడినా కఠిన శిక్షలు, జరిమానా విధించాలని ఈ సవరణల్లో నిర్దేశించారు. కేంద్ర కేబినెట్ వీటికి ఆమోదముద్ర వేసింది. చైల్డ్ పోర్నోగ్రఫీకి చెక్ పెట్టేందుకు నేరగాళ్లకు గతంలో కన్నా అత్యధికంగా […]

మైనర్ రేపిస్టులకూ మరణశిక్ష.. ' పోక్సో ' చట్టానికి సవరణ
Anil kumar poka

|

Jul 11, 2019 | 1:50 PM

దేశంలో చిన్నారులు, పిల్లలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు పెరిగిపోతుండడంతో దీనికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం నడుం బిగించింది. ఇందులో భాగంగా ‘ పోక్సో ‘ చట్టానికి సవరణలను ఆమోదించింది. మైనర్లయినప్పటికీ వారికీ మరణ శిక్ష విధించాలని, అలాగే కల్లా కపటం తెలియని పిల్లలపట్ల వారు ఇతర నేరాలకు పాల్పడినా కఠిన శిక్షలు, జరిమానా విధించాలని ఈ సవరణల్లో నిర్దేశించారు. కేంద్ర కేబినెట్ వీటికి ఆమోదముద్ర వేసింది. చైల్డ్ పోర్నోగ్రఫీకి చెక్ పెట్టేందుకు నేరగాళ్లకు గతంలో కన్నా అత్యధికంగా జరిమానా, జైలుశిక్ష విధించడానికి ఈ సవరణలు వీలు కల్పిస్తున్నాయి. 2012 నాటి ఈ చట్టంలోని 2,4,5, 6, 9, 14, 15, 34, 42, 45 సెక్షన్లకు సవరణలు చేసినట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. వీటిలో ముఖ్యంగా 4, 5, 6 సెక్షన్లను సవరించడం వల్ల మైనర్లకు కూడా కఠిన శిక్షలు పడతాయి. అటు-ట్రాన్స్ జెండర్ల హక్కులు, వారి ఐడెంటిటీకి సంబంధించి వారికి సామాజిక గుర్తింపు, ఆర్ధిక, విద్యాపరమైన సౌకర్యాలను కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతమున్న ‘ పోక్సో ‘ చట్టం వల్ల రేపిస్టులు, క్రిమినల్స్ సులభంగా తప్పించుకోగలుగుతున్నారని, ఈ చట్టానికి సవరణలు చేసినందువల్ల ఇది మరింత పటిష్టమవుతుందని అభిప్రాయపడుతున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu