దళిత యువకుడిని ప్రేమ వివాహం చేసుకున్నందుకు తనను బెదిరిస్తున్నారంటూ ఓ ఎమ్మెల్యే కుమార్తె సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోలు ఉత్తర ప్రదేశ్ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపాయి. బితారీ చైన్పూర్ బీజేపీ ఎమ్మెల్యే రాజేశ్ కుమార్ మిశ్రా అలియాస్ పప్పూ భర్తౌల్ కుమార్తె సాక్షి మిశ్రా… ఈ నెల 4న అజితేశ్ కుమార్ అనే దళిత యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది.ఈ వివాహం ఇష్టంలేని తండ్రి తమను వెదికేందుకు అనుచరులను పంపినట్టు తెలియడంతో… ఈ నెల 10న సాక్షి మిశ్రా ఓ వీడియో విడుదల చేసింది. ‘‘నాకు, నా భర్తకు, ఆయన కుటుంబానికి భవిషత్తులో ఏదైనా జరిగితే అందుకు నా తండ్రి పప్పూ భర్తౌల్, విక్కీ భర్తౌల్, నా తండ్రి అనుచరుడు రాజీవ్ రానాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది..’’ అని సాక్షి ఆ వీడియోలో పేర్కొంది. తమ విషయంలో తండ్రికి సాయం చెయ్యొద్దంటూ ఇతర ఎమ్మెల్మేలు, రాజకీయ నాయకులను కూడా వేడుకుంది.
దీనిపై స్పందించిన బరేలీ ఎస్‌ఎస్‌పీ ‘‘సోషల్ మీడియాలో ఆ దంపతులు పోస్టు చేసిన వీడియో చూశాం. భద్రత కోరుతూ వారు లిఖితపూర్వకంగా కోరితే తప్పకుండా రక్షణ కల్పిస్తాం..’’ అని పేర్కొన్నారు. మరోవైపు ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా సైతం తమ కుమార్తె వివాహంపై స్పందించారు. ‘‘నా కుమార్తె మేజర్. నిర్ణయాలు తీసుకునే అధికారం ఆమెకు ఉంది. మా కుటుంబ సభ్యులు గానీ, నా అనుచరులు గానీ ఎవరూ ఆమెను బెదిరించలేదు…’’ అని ఆయన పేర్కొన్నారు.
BJP MLA from Bareilly, Rajesh Kumar Mishra alias Pappu Bhartaul's daughter has married a man of her choice. The BJP MLA is now after their life, has sent goons. His daughter has released this video requesting help! @Uppolice
Source: @saurabh3vedi
— 𝗚𝗮𝘂𝗿𝗮𝘃 𝗣𝗮𝗻𝗱𝗵𝗶 (@GauravPandhi) July 10, 2019