AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ నేనెందుకు రాజీనామా చేయాలి ‘ ?

కర్ణాటకలో 18 మంది సభ్యుల రాజీనామాలతో తన ప్రభుత్వం చిక్కుల్లో పడినప్పటికీ..సీఎం కుమారస్వామి నిబ్బరంగా ఉన్నారు. తన రాజీనామా అవకాశాన్ని ఆయన తోసిపుచ్చారు. మా ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది. . మాకు తగినంతమంది ఎమ్మెల్యేలున్నారు.. అని ఆయన చెప్పారు. ఇప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం గండంలో పడింది గనుక మీరు రాజీనామా చేయవచ్చునని గత రాత్రి నుంచి ఊహాగానాలు సాగుతున్నాయని మీడియా గురువారం ప్రస్తావించగా.. ఆయన ఇదే మాట అన్నారు. ఈ […]

' నేనెందుకు రాజీనామా చేయాలి ' ?
Pardhasaradhi Peri
| Edited By: |

Updated on: Jul 11, 2019 | 3:56 PM

Share

కర్ణాటకలో 18 మంది సభ్యుల రాజీనామాలతో తన ప్రభుత్వం చిక్కుల్లో పడినప్పటికీ..సీఎం కుమారస్వామి నిబ్బరంగా ఉన్నారు. తన రాజీనామా అవకాశాన్ని ఆయన తోసిపుచ్చారు. మా ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది. . మాకు తగినంతమంది ఎమ్మెల్యేలున్నారు.. అని ఆయన చెప్పారు. ఇప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం గండంలో పడింది గనుక మీరు రాజీనామా చేయవచ్చునని గత రాత్రి నుంచి ఊహాగానాలు సాగుతున్నాయని మీడియా గురువారం ప్రస్తావించగా.. ఆయన ఇదే మాట అన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం, బీజేపీ నేత ఎడ్యూరప్ప ను ఆయన గుర్తు చేశారు. 2009-10 లో ఇదే ఎడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉండగా.. ఎనిమిది మంది మంత్రులతో బాటు 18 మంది ఎమ్మెల్యేలు ఆయనను వ్యతిరేకించారని, అయితే అప్పుడాయన రాజీనామా చేశారా అని కుమారస్వామి అన్నారు. చివరకు ఏం జరిగిందో చూశారుగా అని వ్యాఖ్యానించారు. కాగా-ముంబైలోని హోటల్లో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు తిరిగి బెంగుళూరుకు బయల్దేరారు. ఇలా ఉండగా.. కర్ణాటక సంక్షోభాన్ని మరిపిస్తూ.. గోవాలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. 15 మంది కాంగ్రెస్ సభ్యుల్లో.. 10 మంది పాలక బీజేపీలో చేరిపోయారు. ప్రతిపక్ష నేత చంద్రకాంత్ కవ్ లేకర్ నేతృత్వంలో ఈ పది మందీ కాంగ్రెస్ పార్టీని వీడి కమలం పార్టీలో చేరారు. దీంతో 40 స్థానాలున్న గోవా అసెంబ్లీలో బీజేపీ బలం 27 కు పెరిగింది.

నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌