మద్యం ప్రియులకు మరో గుడ్ న్యూస్..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో మద్యం ప్రియులకు కేజ్రీవాల్ సర్కారు శుభవార్త చెప్పింది. లాక్‌డౌన్ ఎత్తివేత సమయంలో మద్యంపై విధించిన కరోనా స్పెషల్ ఫీజును

మద్యం ప్రియులకు మరో గుడ్ న్యూస్..
Follow us

| Edited By:

Updated on: Jun 07, 2020 | 2:13 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో మద్యం ప్రియులకు కేజ్రీవాల్ సర్కారు శుభవార్త చెప్పింది. లాక్‌డౌన్ ఎత్తివేత సమయంలో మద్యంపై విధించిన కరోనా స్పెషల్ ఫీజును ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఈ నెల పది నుంచి అమల్లోకి రానుంది.

గత నెలలో ఢిల్లీలో మద్యంపై 70 శాతం కరోనా స్పెషల్ ఫీజు విధించడంతో ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో ప్రారంభంలో మద్యం అమ్మకాలు పెద్ద ఎత్తున జరిగినా ధరలు ఎక్కువగా ఉండటంతో తర్వాత తగ్గిపోయాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కరోనా స్పెషల్ ఫీజును తొలగించింది. అయితే మద్యంపై వ్యాట్ మాత్రం 20 నుంచి 25 శాతానికి పెంచారు.

ఢిల్లీలో తాజాగా గడచిన 24గంటల్లో కొత్తగా 1320 పాజిటివ్‌ కేసులు, 53 మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 27,654కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 761మంది మృత్యువాతపడ్డారు. దేశంలో సంభవిస్తున్న కరోనా మరణాల్లో ఢిల్లీ మూడో స్థానంలో ఉంది.

Also Read: విద్యుత్ బిల్లు.. వాయిదాల్లో కట్టొచ్చు.. కానీ..