రసవత్తర పోరులో టాస్ గెలిచిన శ్రేయస్‌ అయ్యర్‌

Delhi Capitals Win The Toss :  రసవత్తరంగా సాగుతున్న లీగ్‌లో మరో ఆసక్తికర పోరుకు తెరలేసింది. దుబాయ్‌ వేదికగా ఢిల్లీ,హైదరాబాద్‌ జట్లు మధ్య సీరియస్ ఫైట్ జరుగోతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్‌‌ ఎంచుకుంది. ఇరు జట్లు 11 మ్యాచ్‌లు ఆడగా ఏడు విజయాలతో ఢిల్లీ రెండో స్థానంలో, ఏడు ఓటములతో హైదరాబాద్‌ ఏడో స్థానంలో నిలిచాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లేఆఫ్ బెర్తు ఖరారు చేసుకోవాలని అనుకుంటోంది ఢిల్లీ. మరోవైపు ప్లేఆఫ్ రేసులో […]

  • Sanjay Kasula
  • Publish Date - 7:44 pm, Tue, 27 October 20
రసవత్తర పోరులో టాస్ గెలిచిన శ్రేయస్‌ అయ్యర్‌

Delhi Capitals Win The Toss :  రసవత్తరంగా సాగుతున్న లీగ్‌లో మరో ఆసక్తికర పోరుకు తెరలేసింది. దుబాయ్‌ వేదికగా ఢిల్లీ,హైదరాబాద్‌ జట్లు మధ్య సీరియస్ ఫైట్ జరుగోతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్‌‌ ఎంచుకుంది. ఇరు జట్లు 11 మ్యాచ్‌లు ఆడగా ఏడు విజయాలతో ఢిల్లీ రెండో స్థానంలో, ఏడు ఓటములతో హైదరాబాద్‌ ఏడో స్థానంలో నిలిచాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లేఆఫ్ బెర్తు ఖరారు చేసుకోవాలని అనుకుంటోంది ఢిల్లీ. మరోవైపు ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే వార్నర్‌సేన ఈ మ్యాచ్‌లో తప్పకుండా గెలవాలి. అయితే టాప్‌-4లో హైదరాబాద్ నిలవాలంటే తర్వాతి మ్యాచ్‌ల్లో విజయం సాధించడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడి ఉంటుంది.

ఢిల్లీ జట్టు సభ్యులు : శిఖర్‌ ధావన్‌, రహానె, శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్), పంత్‌, హెట్‌మైయర్‌, స్టాయినిస్, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రబాడ, నోర్జె, తుషార్‌ దేశ్‌పాండే

హైదరాబాద్‌ జట్టు సభ్యులు : వార్నర్‌ (కెప్టెన్‌), విలియమ్సన్‌, మనీష్‌ పాండే, విజయ్‌ శంకర్, వృద్ధిమాన్‌ సాహా, హోల్డర్‌, అబ్దుల్‌ సమద్‌, రషీద్‌ ఖాన్‌, నదీమ్‌, సందీప్‌ శర్మ, నటరాజన్‌