బలపడుతున్న భారత రక్షణ వ్యవస్థ.. కొత్త ఆయుధాల కొనుగోలుకు డిఎసి ఆమోదముద్ర

కేంద్ర ప్రధాని నరేంద్రమోదీ సర్కార్ దేశ రక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. త్రివిధ దళాల పటిష్టానికి అనేక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఆత్మనిర్భర భారత్ పేరుతో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆయుధాలను ప్రోత్సహిస్తున్నారు.

బలపడుతున్న భారత రక్షణ వ్యవస్థ.. కొత్త ఆయుధాల కొనుగోలుకు డిఎసి ఆమోదముద్ర
Follow us

|

Updated on: Dec 18, 2020 | 2:08 PM

కేంద్ర ప్రధాని నరేంద్రమోదీ సర్కార్ దేశ రక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. త్రివిధ దళాల పటిష్టానికి అనేక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఆత్మనిర్భర భారత్ పేరుతో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆయుధాలను ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా కొత్తగా ఆయుధ సంపత్తి కొనుగోలుకు భారత రక్షణ శాఖ పూనుకుంది. త్రివిధ దళాల కోసం రూ.28 వేల కోట్ల విలువైన ఆయుధాలు, ఇతర సైనిక పరికరాల కొనుగోలుకు రక్షణ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ నేతృత్వంలోని ‘ది డిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌(డిఎసి) ఆమోదం తెలిపింది. ఈ మేరకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

తూర్పు లఢఖ్‌ ప్రాంతంలో భారత్‌, చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త ఆయుధాల కొనుగోళ్లకు ఆమోదముద్ర వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశీయ పరిశ్రమల నుంచే ఈ కొత్త ఆయుధాలను కొనుగోలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆమోదించబడిన ప్రతిపాదనల్లో భారత వైమానిక దళం కోసం డిఆర్‌డిఓ రూపొందించిన ఆయుధా సంపత్తిని కొనుగోలు చేయనున్నారు. ఇందులో భాగంగా వాయుమార్గంలో ముందస్తు హెచ్చరిక, నియంత్రణ వ్యవస్థలు.. అదేవిధంగా భారత సైన్యానికి మాడ్యులర్‌ వంతెనలు ఉన్నాయి. వీటిలో భారత వాయు సేనకు సంబంధించిన 6 ఎయిర్‌బోర్న్‌ వార్నింగ్‌, కంట్రోల్‌ సిస్టమ్‌ విమానాలు కూడా ఉన్నాయని అధికారవర్గాలు తెలిపాయి. అలాగే, 9వేల కోట్ల వ్యయంతో నేవీ కోసం 11 తదుపరి తరం ఆఫ్‌షోర్‌ పెట్రోలింగ్‌ వెసెల్స్‌ను కొనుగోలు చేసే ప్రతిపాదనకు డీఏసీ ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది.

పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?