తీరం దాటిన వాయుగుండం, గండం తప్పినట్లే

గండం గడిచింది.  వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం పశ్చిమబెంగాల్‌- బంగ్లాదేశ్‌ తీరాలకు దగ్గరలో తీరం దాటినట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

తీరం దాటిన వాయుగుండం, గండం తప్పినట్లే
Follow us

|

Updated on: Oct 23, 2020 | 9:15 PM

గండం గడిచింది.  వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం పశ్చిమబెంగాల్‌- బంగ్లాదేశ్‌ తీరాలకు దగ్గరలో తీరం దాటినట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో తేలికపాటి వర్షాలు తప్పితే పెద్దగా వర్షాలు కురిసే చాన్స్ లేదని వాతావరణ శాఖ అధికారుల తెలిపారు. నైరుతి రుతుపవనాలు తిరిగి వెళ్లడానికి వాతావరణ పరిస్థితులు పూర్తి సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఛత్తీష్‌గడ్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌,  గుజరాత్‌, ఉత్తర/మధ్య అరేబియా సముద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న నైరుతి రుతుపవనాలు ఈ నెల 25వ తేదీ నాటికి  నిష్క్రమించనున్నాయి. ఈ నెల 27 నాటికి ఒడిశా, ఉత్తర మహారాష్ట్రలోని పలు ప్రాంతాలతో పాటు, పశ్చిమ బెంగాల్‌, సిక్కిం, తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర నుంచి నైరుతి రుతుపవనాల  నిష్క్రమణానికి అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నట్లు వాతవరణ శాఖ తెలిపింది.

Also Read :

Breaking : మళ్లీ గ్రే జాబితాలోనే పాకిస్థాన్ !

మోహన్​బాబు స్టైలిష్ట్​గా మంచు విరోనికా !